ETV Bharat / bharat

యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో... - ఎన్​సీబీ ప్రైవేట్ ఆర్మీ

Fake ncb officers: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) 'నకిలీ అధికారుల' వేధింపులు తట్టుకోలేక ముంబయికి చెందిన ఓ నటి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఎన్​సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో సదరు నటిని డబ్బుల కోసం వేధించి, బలవన్మరణానికి పాల్పడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.

Fake ncb officers
ఫేక్ ఎన్​సీబీ అధికారుల బెదిరింపులు
author img

By

Published : Dec 26, 2021, 6:28 PM IST

Fake ncb officers: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. తాము నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) అధికారులమంటూ ఇద్దరు దుండగులు భయభ్రాంతులకు గురిచేయగా ఓ నటి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

Mumbai actress suicide: ముంబయికి చెందిన ఓ నటి(28) తన స్నేహితులతో కలిసి డిసెంబరు 20న ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​లో పార్టీకి వెళ్లింది. అక్కడకు ఇద్దరు నకిలీ ఎన్​సీబీ అధికారులు వచ్చి, డ్రగ్స్​ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే.. రూ.20 లక్షలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. డబ్బుల కోసం నిందితులు.. ఆమెకు పదేపదే ఫోన్​ చేసి విసిగించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోని ఫ్యాన్​కు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితులు సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్​ రఘునాథ్ వాలింబే​(35)ను ఠాణెలో అరెస్టు చేశారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

'ఎన్​సీబీనే చేసింది'

Nawab malik on ncb: నటి ఆత్మహత్య నేపథ్యంలో ఎన్​సీబీపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్​సీబీనే తమ ప్రైవేట్ ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని చెప్పారు.

"బాలీవుడ్ నటీమణుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ఎన్​సీబీనే ఓ ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసింది. ఫేక్ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను గుంజుతోంది."

-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి.

ఎన్​సీబీ ప్రైవేట్ ఆర్మీ వేధింపులను తట్టుకోలేకపోవడం వల్లే సదరు నటి బలవన్మరణానికి పాల్పడిందని మాలిక్ చెప్పారు.

ఇదీ చూడండి: గ్యాస్​ ట్యాంకర్​ బోల్తాపడి పేలుడు- 2కి.మీ మేర వ్యాపించిన మంటలు

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్​ రేప్​- 9 మంది అరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.