ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వ తీరు కారణంగా లాక్డౌన్ విధించేలా దేశంలో పరిస్థితులు మారాయని కాంగ్రెస్ రాహుల్ గాంధీ విమర్శించారు. తాను సంపూర్ణ లాక్డౌన్కు వ్యతిరేకం అని ట్విట్టర్ వేదికగా గురువారం పేర్కొన్నారు.
"గతేడాది విధించిన ప్రణాళిక లేని లాక్డౌన్తో ప్రజలపై ప్రాణాంతక దాడి జరిగింది. అందుకే నేను సంపూర్ణ లాక్డౌన్ విధించడాన్ని వ్యతిరేకిస్తాను. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైఫల్యం, ఎలాంటి వ్యూహం లేని కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీ సహా అన్ని రకాల సహాయాలను అందించడం అత్యవసరం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
రాహుల్ మరో ట్వీట్లో పెట్రో ధరల పెరుగుదలపై తప్పుబట్టారు. ఎన్నికల ముగిసినందున చమురు ధరలతో దోపిడీ ప్రారంభమైందని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 నగదును ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎన్నికల సంఘం పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు