ETV Bharat / bharat

ఫేక్​​ ఫ్రెండ్​ - మహిళకు రూ.42 లక్షలు టోకరా - ఫేస్​బుక్​ ద్వారా సైబర్​ నేరాలు

Facebook Cyber Crime: సోషల్​మీడియాలో సైబర్​ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫేక్​ అకౌంట్లతో రూ. లక్షలు కాజేస్తున్నారు. దిల్లీలో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ఫేస్​బుక్​ పరిచయంతో సైబర్​ నేరగాళ్లు బాధితురాలి నుంచి ఏకంగా రూ. 42 లక్షలు దోచుకున్నారు.

facebook cyber crime
ఫేస్​బుక్​ ఫ్రెండ్​ టోకరా- మహిళ నుంచి రూ.42 లక్షలు లూటీ
author img

By

Published : Dec 30, 2021, 8:43 AM IST

Facebook Cyber Crime: సైబర్​ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఓ మహిళ బహుమతులకు ఆశపడి రూ.42 లక్షలు పోగొట్టుకుంది. దిల్లీలో జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది..

సెక్టార్​ 45లో నివసించే బాధితురాలికి కొన్ని నెలల క్రితం ఫేస్​బుక్​లో నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆర్తీ అనే పేరుతో నిందితుడు బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలి వివరాలు సేకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధితురాలికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్​ వచ్చింది. బాధితురాలికి చెందిన బహుమతులు ముంబయిలోని తమ కార్యాలయంలో ఉన్నాయని.. అవి అందాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. బాధితురాలి పేరున బంగారం, వాచీలు సహా రూ.55 లక్షలు విలువ చేసే నగదు ఉందని నిందితులు పేర్కొన్నారు.

సైబర్​ వలలో చిక్కుకున్న బాధితురాలు వారు అడిగిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తూ వచ్చింది. 45 రోజుల పాటు ఆరు విడతల్లో మొత్తం రూ.42 లక్షలను చెల్లించింది. ఈ డబ్బు కట్టేందుకు బాధితురాలు అప్పు కూడా చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యూపీలో కూడా..

ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లోని రాయబరేలీ జిల్లాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. సోషల్​ మీడియాలో పరిచయమైన వ్యక్తి బాధితురాలిని నమ్మించి ఆమె నుంచి రూ.32 లక్షలు కాజేశాడు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇదీ చూడండి : Nagaland firing incident: నాగాలాండ్​ కాల్పుల ఘటనపై ఆర్మీ దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.