తమిళనాడులోని కోయంబత్తూర్లో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల శివనామ స్మరణతో ఈశా కేంద్రం మార్మోగుతోంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది.
కార్యక్రమం ముందుగా ఈశా కేంద్రంలోని లింగ భైరవి యాత్రతో ప్రారంభమైంది. ప్రతీ ఏటా నిర్వహించేే విధంగా కాకుండా ఈ సారీ వర్చువల్ విధానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్నవారిని మాత్రమే ప్రత్యక్ష కార్యక్రమాలకు అనుమతించారు.
రాత్రిపూట జరిగే కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరయ్యే వారు కరోనా నిబంధనలు పాటించిన వారినే ఈశా కేంద్రంలోకి అనుమతించారు.
ఈ రాత్రి అంతా జరిగే జాగారం.. చివరుకు మహా హారతితో ముగియనుంది.