ETV Bharat / bharat

భారత్​లో 49 లక్షల కొవిడ్​ మరణాలు.. నిజమేనా? - కొవిడ్​ మరణాల నివేదికపై కేంద్రం అసంతృప్తి

కరోనా మరణాలు(Covid deaths in India).. కేంద్రం లెక్కలకన్నా 10 రెట్లు అధికంగా ఉన్నాయని అంచనా వేస్తూ ముగ్గురు పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఎక్కడో అమెరికా, బ్రిటన్​లో.. వయస్సు ఆధారంగా మరణాల రేటును గుర్తించేందుకు చేసిన అధ్యయనాలను ఇక్కడ కూడా ఉపయోగిస్తే ఎలా అని ప్రశ్నించింది. తాజా ప్రకటనతో దేశంలో కొవిడ్​ మరణాల లెక్కలు ఓ మిస్టరీగానే మిగిలిపోయాయి.

covid, corona
కరోనా, కొవిడ్ మరణాలు
author img

By

Published : Jul 23, 2021, 6:39 PM IST

భారత్​లో కొవిడ్​ మరణాల(Covid deaths in India) సంఖ్యపై గందరగోళం నెలకొంది. కేంద్రం చూపిన లెక్కల కన్నా 8 నుంచి 10 రెట్లు అధికంగా కరోనా(Covid-19) మరణాలు సంభవించాయని కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సహా ముగ్గురు పరిశోధకులు తమ అధ్యయనంలో తేల్చారు. వాస్తవంగా మరణించినవారు దాదాపుగా 34 లక్షల నుంచి 49 లక్షల వరకు ఉంటారని పేర్కొన్నారు. ఈ అధ్యయనంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ లెక్కల్లో వాస్తవంలేదని నివేదికను తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో మరణాల లెక్కలు ప్రశ్నార్థకంగా మారాయి.

అరవింద్ సుబ్రమణియణ్, హార్వర్డ్​ విశ్వవిద్యాలయ నిపుణుడు అభిషేక్ ఆనంద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్​మెంట్ నిపుణుడు జస్టిన్ సాండెఫర్​లు ఈ నివేదక రూపొందించారు.

మూడు విధానాలు..

భారత్‌లో సంభవించిన అదనపు మరణాలను అంచనా వేసేందుకు మూడు భిన్న నివేదికలపై అధ్యయనం చేశారు.

  • భారత జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదు పరిశీలన.
  • భారత్​లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్లు
  • సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) అనే ప్రైవేటు సంస్థ చేసిన ఆర్థిక సర్వేలో పాల్గొన్న 8 లక్షల మంది వివరాల పరిశీలన.

ఇదీ చదవండి:'కరోనా మరణాలు.. కేంద్రం లెక్కలకన్నా 10 రెట్లు అధికం!'

రహస్యంగా ఉంచడం వల్లే..

కొవిడ్​తోనే కాకుండా ఇతర కారణాల వల్లా మరణించిన వారి డేటాను సేకరించినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే.. కొవిడ్ మొదటి దశ వ్యాప్తిలో మరణాల సంఖ్యను రహస్యంగా ఉంచడం వల్లే రెండో దశ ఉగ్రరూపం దాల్చిందని అభిప్రాయపడ్డారు.

అయితే.. ఎక్కడో అమెరికా, బ్రిటన్​లో.. వయస్సు ఆధారంగా మరణాల రేటును గుర్తించేందుకు చేసిన అధ్యయనాలను.. ఇక్కడ కూడా వాడితే ఎలా అని ఆరోగ్య శాఖ ప్రశ్నించింది. రాష్ట్రాలు సేకరించిన సివిల్ రిజిస్ట్రేషన్​ ఆఫ్​ డెత్స్(సీఆర్​ఎస్) డేటాను, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సేకరించిన కన్స్యూమర్ పిరమిడ్ హౌస్​హోల్డ్ సర్వే డేటాను కూడా తప్పుపట్టింది. మరణించిన వారందరి డేటాను సేకరిస్తే సరిపోదు.. దానికి కారణమేంటో కూడా తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో.. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 2,50,000 మంది మరణించినట్లు తెలిసింది. దీంతో పలువురు నిపుణులు.. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని రాష్ట్రాలు తప్పుడు లెక్కలు చూపుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కొత్త కేసుల్లో 'డెల్టా' రకమే అధికం!

మొదటి విధానంతో..

భారత జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదును పరిశీలించాక కొవిడ్​ మరణాల రేటు దాదాపు 34 లక్షల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్​గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల సీఆర్​ఎస్​ డేటాను పరిగణనలోకి తీసుకుని నిర్ధరణకు వచ్చారు.

ఫస్ట్​ వేవ్​లో దాదాపుగా 20 లక్షల మంది మరణించి ఉంటారని, మూడు నెలలపాటు ఉన్న సెకండ్​ వేవ్​లో 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని నిపుణులు అంచనా వేశారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. మొదటి దశలో 1,60,000 మంది రెండో దశలో 2,40,000 మంది మరణించారు.

రెండో విధానం ద్వారా..

భారత్​లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు పరిశీలన ఆధారంగా.. కొవిడ్​ మరణాలు 40 లక్షలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు.

వైరస్​ వ్యాప్తి మొదటి దశలో 15 లక్షల మంది.. రెండో దశలో 24 లక్షల మంది మరణించి ఉంటారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:Corona: తల్లిదండ్రులను కోల్పోయిన లక్షల మంది చిన్నారులు

మూడో విధానం ద్వారా..

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) అనే ప్రైవేటు సంస్థ చేసిన ఆర్థిక సర్వేలో పాల్గొన్న 8 లక్షల మంది వివరాలను పరిశీలించిన అనంతరం..​ మరణాల సంఖ్య 49 లక్షలుగా ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే కొవిడ్‌తోనే 40లక్షల మంది చనిపోయారని చెప్పలేమని స్పష్టం చేశారు.

మొదటి దశలో 34 లక్షల మంది రెండో దశలో 15 లక్షల మంది మరణించారని అంచనా వేశారు.

మహమ్మారి తీవ్రత..

కొవిడ్​ మరణాలు ఎన్ని అని కచ్చితంగా అంచనా వేయడం కష్టసాధ్యమని నిపుణులు తెలిపారు. అయితే.. ఈ నివేదిక ద్వారా కొవిడ్​ తీవ్రతను, అదనపు మరణాలు తెలియజేశామని స్పష్టం చేశారు. మొదటి దశ వ్యాప్తిలో మరణాలను రహస్యంగా ఉంచడమే రెండో దశ విజృంభణకు కారణమైందని తెలిపారు.

ఇదీ చదవండి:కొవిడ్‌తో మానసిక రోగులకే తీవ్రముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.