ETV Bharat / bharat

గుజరాత్​ మళ్లీ 'భాజపా'దే.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలివే.. - gujarat elections 2022 bjp

Gujarat Exit Polls 2022: ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల ప్రకారం గుజరాత్‌లో భాజపా అధికారం నిలబెట్టుకుంటోంది. వరుసగా ఏడోసారి కమలదళం జయభేరి మోగిస్తుందని అన్ని సంస్థల సర్వేల ద్వారా స్పష్టమైంది. కాంగ్రెస్‌ రెండోస్థానానికి పరిమితం కాగా ఆమ్‌ఆద్మీ పార్టీ పెద్దగా ఉనికి చాటుకోలేదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి.

Gujarat Exit Polls 2022:
Gujarat Exit Polls 2022:
author img

By

Published : Dec 5, 2022, 6:38 PM IST

Updated : Dec 5, 2022, 8:50 PM IST

Gujarat Exit Polls 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా జోరు కొనసాగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అన్ని సంస్థల అంచనాల ప్రకారం గుజరాత్ లో భాజపా అధికారం నిలబెట్టుకుంటుందని స్పష్టమైంది. ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే ప్రకారం భాజపాకు 128 నుంచి 140 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్‌కు 31 నుంచి 43, ఆమ్‌ఆద్మీకి 3 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 182 స్థానాలకు భాజపా 125 నుంచి 143 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెస్​కు 30 నుంచి 48 స్థానాలు, ఆప్ మూడు నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని పేర్కొంది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్ 25 నుంచి 35 సీట్లు, ఆమ్ ఆద్మీ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.

ఆత్మసాక్షి సర్వే ప్రకారం భాజపాకు 98నుంచి 110 సీట్లు వస్తాయని తేలగా కాంగ్రెస్ 66 నుంచి 71 స్థానాలు, ఆప్ 9 నుంచి 14 సీట్లు గెల్చుకోనున్నాయి. న్యూస్ ఎక్స్ జన్‌కీ బాత్‌ సర్వే ప్రకారం భాజపా 117 నుంచి 140 సీట్లు సాధించనుంది. కాంగ్రెస్ 34 నుంచి 51 చోట్ల, ఆప్ 6 నుంచి 13చోట్ల గెలవనున్నాయి. రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్యూ సర్వేలోనూ భాజపాకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. భాజపాకు 128 నుంచి 148 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 30 నుంచి 42, ఆమ్‌ఆద్మీకి 2నుంచి 10 సీట్లు రానున్నట్లు తేలింది.

టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే కూడా కమలం పార్టీకే జై కొట్టింది. ఇందులో భాజపాకు 139 సీట్లు రాగా కాంగ్రెస్‌ 30, ఆప్‌ 11 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. ఆజ్‌తక్‌-యాక్సిస్‌ మై ఇండియా సర్వే కూడా భాజపాకే స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టింది. భాజపాకు 129 నుంచి 151, కాంగ్రెస్‌కు 16 నుంచి 30, ఆమ్‌ఆద్మీకి 9 నుంచి 21 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.

రిపబ్లిక్‌ టీవీ

  • భాజపా 128-148
  • కాంగ్రెస్‌ 30-42
  • ఆప్‌ 2-10

జన్‌కీ బాత్‌

  • భాజపా 117-140
  • కాంగ్రెస్‌ 34-51
  • ఆప్‌ 6-13

పీపుల్స్‌ పల్స్‌

  • భాజపా 125-143
  • కాంగ్రెస్‌ 30-48
  • ఆప్‌ 3-7

ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌

  • భాజపా 130-145
  • కాంగ్రెస్‌ 25-35
  • ఆప్‌ 5-7

ఆత్మసాక్షి

  • భాజపా 98-110
  • కాంగ్రెస్‌ 66-71
  • ఆప్‌ 9-14

న్యూస్‌ ఎక్స్‌

Last Updated : Dec 5, 2022, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.