ETV Bharat / bharat

'370 పేరుతో గుప్కర్​ గ్యాంగ్ కొత్త నాటకం' - తాజా వార్తలు ఆర్టికల్​ 370

కశ్మీర్​లో ఎన్నికల వేడి రాజుకుంది. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం తొలిసారి జరగబోతోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భాజపా వ్యూహరచన చేస్తోంది. అధికరణ 370 పునరుద్ధరణే లక్ష్యంగా ఏర్పాటైన గుప్కర్​ కూటమిపై విమర్శల జోరు పెంచింది. ఏం చేసినా 370 పునరుద్ధరణ ప్రసక్తే లేదని భాజపా సీనియర్​ నేత షానవాజ్ హుస్సేన్ 'ఈటీవీ భారత్'​ ముఖాముఖిలో స్పష్టం చేశారు.

Gupkar
'ఆర్టికల్​ 370 పునరుద్ధరణ చేసే ప్రసక్తే లేదు'
author img

By

Published : Nov 22, 2020, 12:33 PM IST

'ఆర్టికల్​ 370 పునరుద్ధరణ చేసే ప్రసక్తే లేదు'

ఆర్టికల్​ 370 పునరుద్ధరణ పేరుతో కశ్మీర్​ ప్రజలను నేషనల్​ కాన్ఫరెన్స్​ (ఎన్​సీ), పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ (పీడీపీ) తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా సీనియర్​ నేత సయ్యద్​ షానవాజ్​ హుస్సేన్ ఆరోపించారు. కశ్మీర్​లో జిల్లా అభివృద్ధి ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు.

"ప్రజాక్షేమం కాదు స్వలాభం కోసమే గుప్కర్​ గ్యాంగ్​ ఏర్పాటు చేశారు. ఆర్టికల్​ 370, 35ఏతో ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరిస్తామనే పేరుతో నాటకాలు ఆడుతున్నారు. వాళ్ల పాచికలు భాజపా దగ్గర పారవు. ఆర్టికల్​ 370 ముగిసిన అధ్యాయం. పునరుద్ధరణ అసాధ్యం."

- సయ్యద్​ షానవాజ్​ హుస్సేన్, భాజపా సీనియర్ నేత

జమ్ముకశ్మీర్​ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా గుప్కర్​ కూటమి చైనాను సాయం అడుగుతోందని హుస్సేన్ ఆరోపించారు. కుటుంబ పాలనను నమ్మే వారి మాటలను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు.

"ప్రజా సంక్షేమం కోసం తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు కుటుంబపాలన కోసం, వారి పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు చేయడం కోసమే ఇన్నాళ్లూ పనిచేశాయి. ఏనాడూ కశ్మీర్​ యువతకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే వారిని ప్రజలు పక్కన పెట్టారు. మాకు ఓటు వేసి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. గుప్కర్​ గ్యాంగ్​ చేయని అభివృద్ధిని వచ్చే ఐదేళ్లలో మేం చేస్తాం."

- సయ్యద్​ షానవాజ్​ హుస్సేన్, భాజపా సీనియర్ నేత

నవంబర్​ 28న జరగనున్న ఎన్నికలకు జమ్ము కోసం కేంద్ర మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కశ్మీర్​ కోసం అనురాగ్​ ఠాకూర్​ను భాజపా ప్రచారకర్తలుగా రంగంలోకి దింపింది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.