ETV Bharat / bharat

'కరోనా కట్టడికి జాతీయ విధానాన్ని రూపొందించాలి'

భారత్​లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జాతీయ విధానం రూపొందించాలని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. వైరస్​పై పోరాటంలో మోదీ సర్కార్​తో కాంగ్రెస్​ కలిసి పనిచేస్తుందన్నారు.

Congress leader, Sonia Gandhi
సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధినేత్రి
author img

By

Published : May 1, 2021, 2:00 PM IST

దేశంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు జాతీయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ. ఇందుకోసం రాజకీయంగా ఏకాభిప్రాయం తీసుకురావాలని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • कोरोना महामारी के इस चुनौतीपूर्ण समय में आपके व आपके परिवार की सुरक्षा और अच्छे स्वास्थ्य की कामना करती हूं। वह लाखों परिवार जिन्होंने अपने परिजनों को खोया है, उनके प्रति दिल से अपनी संवेदना व्यक्त करती हूं।

    - कांग्रेस अध्यक्षा, श्रीमती सोनिया गांधी#COVID19India pic.twitter.com/btmCeG8K6B

    — Congress (@INCIndia) May 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానాన్ని రూపొందించాలి. దానిపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని సేకరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై తమ విధులను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధినేత్రి

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు.. ప్రతి పేద కుటుంబం ఖాతాలో రూ.6,000 జమ చేయాలని మోదీ సర్కారును అభ్యర్థించారు సోనియా. అంతేకాకుండా.. టెస్టుల​ను వేగవంతం చేయడం సహా.. అత్యవసర ఔషధాల బ్లాక్​ మార్కెటింగ్​పై చర్యలు చేపట్టాలని సూచించారు.

మహమ్మారి వ్యతిరేక పోరాటంలో హస్తం పార్టీ.. కేంద్రంతో కలిసి పనిచేస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశప్రజలంతా ఐక్యంగా ఉండాలని సోనియా అన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ కల్లోల'మే'- హెచ్చరించినా పట్టించుకోని కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.