ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం), ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీప్యాట్) స్లిప్‌ల మధ్య సంఖ్య 100 శాతం ట్యాలీ అయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీంతో ఈ యంత్రాల కచ్చితత్వం, ప్రామాణికత మరోసారి రుజువు అయ్యాయని ఈసీ అధికారి పేర్కొన్నారు.
2021 ఎన్నికల నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీకి లేఖ రాశారు. ఈవీఎం సంఖ్యకు సరిపడా వీవీప్యాట్ స్లిప్‌లు ఉన్నాయో లేదో ట్యాలీ చేయాలని కోరారు.
వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఇదివరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. 2019 ఏప్రిల్‌లో సుప్రీం ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ.. ప్రతి నియోజకవర్గంలో ఐదు ఈవీఎంలకు వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించాలని ఆదేశించింది.
నిబంధన ప్రకారం ఒకవేళ ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య లెక్కలో అవకతవకలు వస్తే వీవీప్యాట్ సంఖ్యనే ఈసీ పరిగణిస్తుంది.
ఇదీ చదవండి : ఈసీ అడ్డగోలు వాదనలు - సుప్రీంకోర్టు మొట్టికాయలు