ETV Bharat / bharat

Famous Temples in Hyderabad : మీరు హైదరాబాద్​లో తప్పక దర్శించుకోవాల్సిన 7 ప్రముఖ దేవాలయాలివే.!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 10:49 AM IST

7 Famous Temples in Hyderabad : హైదరాబాద్​లో​ పర్యాటక ప్రదేశాలే కాదు.. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా కూడా ప్రాచూర్యం పొందాయి. మరి ఇంతకీ ఆ దేవాలయాలు ఏంటి..? వాటి టైమింగ్స్​..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Temples
Temples in Hyderabad

Famous Temples in Hyderabad : దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగ్గ పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. ఆర్థిక, సామాజిక, రాజకీయం, పర్యాటకం, పురాతన ప్యాలెస్​లు, కోటలు, రుచికరమైన బిరియానీ, హలీంలకు పేరెన్నిక గల నగరం హైదరాబాద్. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సాధారణంగా హైదరాబాద్​ అంటే.. చార్మినార్(Charminar), గోల్కొండ, ట్యాంక్ బండ్, సాలార్ జంగ్ మ్యూజియం.. లాంటివి గుర్తొస్తాయి.

అయితే, ఇవి మాత్రమే కాకుండా భాగ్యనగరంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన చేసిన ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక క్షేత్రాలుగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ప్రాచూర్యం పొందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​(Hyderabad)లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన 7 ప్రముఖ దేవాలయాల జాబితాను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. జగన్నాథ దేవాలయం(Jagannath Temple) : శ్రీకృష్ణుని రూపంగా భావించే జగన్నాథునికి అంకితం చేసిన జగన్నాథ దేవాలయం హైదరాబాద్​లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. దీనిని నగరం ప్రజలతో పాటు తెలంగాణలో నివసించే ఒరిస్సాకు చెందిన వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు కలిసి 2009లో నిర్మించారు. ప్రధాన దైవం జగన్నాథుడే అయినా ఇక్కడ సుభద్రా దేవి, శ్రీకృష్ణుని అన్నయ్య అయిన బలరాముని విగ్రహాలను కూడా చూడవచ్చు. పూరిలోని ఐకానిక్ జగన్నాథ ఆలయాన్ని పోలి ఉండే ఈ ఆలయం తెలంగాణ ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

టైమింగ్స్​ : ఉదయం 6:00 నుంచి 11:00 వరకు, సాయంత్రం 5:00 నుంచి రాత్రి 9:00 వరకు

లొకేషన్ : భవానీ నగర్, బంజారాహిల్స్, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ బస్ స్టాప్

2. రత్నాలయం దేవాలయం(Ratnalayam Temple) : హైదరాబాద్​లో మీరు సందర్శించాల్సిన ప్రముఖ దేవాలయాలలో రత్నాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలో వేంకటేశ్వరుడు, ఆండాళ్ దేవితో పాటు పద్మావతి దేవిని భక్తులు పూజిస్తారు. ఇక్కడ మీరు తప్పక చూడాల్సినది విష్ణువు తన భార్యలతో కలిసి ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు కొలువై ఉన్న ఫౌంటెన్. శంఖు, చక్రం, నామంతో సహా వైష్ణవ చిహ్నాలను వర్ణించే మరికొన్ని ఫౌంటైన్‌లు ఇక్కడ ఉన్నాయి. మీరు ఆలయ సెంట్రల్ హాల్‌లో ఇతర భక్తులతో కలిసి విష్ణు సహస్రనామం జపించవచ్చు లేదా బయట అందమైన తోటలలో అలా కాసేపు సేద తీరవచ్చు. విషపూరిత పాము కాలియాపై విష్ణువు నృత్య భంగిమలో ఉన్న అద్భుతమైన శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఓపెనింగ్ టైమ్స్ : ఉదయం 6:00 నుంచి 12:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి 8:00 వరకు (సోమవారం-శుక్రవారం)

ఉదయం 6:00 నుంచి 1:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి 9:00 వరకు (వీకెండ్స్​, సెలవు రోజుల్లో)

లొకేషన్ : అలియాబాద్, రంగారెడ్డి

సమీప బస్ స్టాప్ : అలియాబాద్ X రోడ్ బస్ స్టాప్

3. బిర్లా మందిర్(Birla Mandir) : హైదరాబాద్‌లోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ లార్డ్ వెంకటేశ్వర ఆలయం నౌబత్ పహాడ్‌లో 280 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని 1976లో రామకృష్ణ మిషన్‌కు సంబంధించిన స్వామి రంగనాథానంద ప్రారంభించారు. మెరిసే తెల్లటి పాలరాయితో, గుర్బానీ, ఇతర మత బోధనల శ్లోకాలతో గోడలపై చెక్కబడిన ఈ ఆలయం 13 ఎకరాలలో విస్తరించి ఉంది. 11 అడుగుల పొడవు గ్రానైట్‌తో చేసిన విష్ణుమూర్తితో సహా అందమైన రాతి శిల్పాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. రాతితో చెక్కిన తామర పువ్వు, గొడుగు కూడా విగ్రహం గొప్పతనాన్ని తెలియజేస్తాయి.

టైమింగ్స్​: ఉదయం 7:00 నుంచి 12:00 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 9:00 వరకు

లొకేషన్ : హిల్ ఫోర్ట్ రోడ్, అంబేడ్కర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : ఆంధ్రా బ్యాంక్ బస్ స్టాప్

Places to Visit in Hyderabad Details: ఫ్యామిలీతో టైం స్పెండ్​ చేయాలనుకుంటున్నారా..? హైదరాబాద్​లో ఈ ప్లేసెస్​కు వెళ్లండి..!

4. ఇస్కాన్ టెంపుల్(ISKCON Temple) : ఇస్కాన్ టెంపుల్స్ ఏ నగరంలో ఉన్న పర్యాటక కోణానికి ఎంతో శోభను తీసుకొస్తాయి. హైదరాబాద్‌లో కూడా అలాంటి టెంపుల్ ఒకటి ఉంటుంది. శ్రీకృష్ణుడు, రాధల లీలలను వర్ణించే శిల్పాలు ఈ టెంపుల్​లో ఉన్నాయి. దీనినే శ్రీ శ్రీ రాధా మదన మోహన ఆలయం అని కూడా పిలుస్తారు. ఇస్కాన్ ఆలయం ఏడాది పొడవునా అనేక సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆతిథ్యం ఇస్తుంది. క్యాసెట్ లైబ్రరీ, వేద లైబ్రరీ ఈ ఆలయంలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ మీరు హిందూ గ్రంథాలైన భాగవతం, సంస్కృతం, భగవద్గీత, ఉపనిషత్తులలో రోజువారీ తరగతులకు కూడా హాజరు కావచ్చు.

ఓపెనింగ్ టైమింగ్స్ : ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు

లొకేషన్ : నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : అబిడ్స్ GPO బస్ స్టాప్

5. శ్యామ్ టెంపుల్(Shyam Temple) : హైదరాబాద్ లోని శ్యామ్ బాబా దేవాలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ ఆ కృష్ణభగవానుడిని శ్యామ్ బాబా పేరుతో కొలుస్తారు. దేవాలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. జన్మాష్టమి వంటి రోజుల్లో వేలసంఖ్యలో ఇక్కడ భక్తులు భగవంతుడిని సందర్శిస్తూ ఉంటారు.
కృష్ణ భగవానుడి రాతి శిల్పాలు, ఆలయ నిర్మాణం పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఇది తెరిచే సమయం : ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 8:30 వరకు

లొకేషన్ : కంచెగూడ స్టేషన్ రోడ్, వీరన్న గుట్ట, బర్కత్‌పుర, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : కాచిగూడ బస్ స్టాప్

Top Tourist Places in Hyderabad : హైదరాబాద్​లో కొత్త పర్యాటక ప్రాంతాలు.. వీటిని మీరు చూసారా!

6. వెంకటేశ్వర స్వామి దేవాలయం(Venkateswara Swamy Temple) : చిల్కూర్ బాలాజీ ఆలయం మీరు సందర్శించాల్సిన ప్రముఖ దేవాలయాలలో మరొకటిగా చెప్పుకోవచ్చు. ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉన్న ఈ ఆలయం హైదరాబాద్ చుట్లూ ఉన్న పూరాతన ఆలయాలలో ఒకటి. ప్రతి వారం దాదాపు 1 లక్ష మంది భక్తులు ఈ దేవస్థానాన్ని సందర్శిస్తారు. అత్యంత ప్రసిద్ధ విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి. ఈ స్వామినే “పాస్పోర్ట్ బాలాజీ” లేదా “విసా బాలాజీ” గా కూడా పిలుస్తారు. పాస్ పోర్ట్, విసా పొందడంలో ఏర్పడే చిక్కులన్నీ ఈ దేవాలయన్ని సందర్శించడం వల్ల సమిసిపోతాయని నమ్ముతారు. డబ్బు రూపంలో ఎటువంటి కానుకలు ఈ దేవాలయంలో స్వీకరించకపోవడం గమనార్హం.
ఇది తెరిచే ఉంచే సమయం : ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 వరకు

లొకేషన్ : హిమాయత్ నగర్, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : చిల్కూర్ బాలాజీ టెంపుల్ బస్ స్టాప్

7. కేసరి హనుమాన్ దేవాలయం(Kesari Hanuman Temple) : కేసరి హనుమాన్​ ఆలయం మీరు సందర్శించాల్సిన ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది స్వయంగా రామ భక్తుడైన హనుమంతునికి అంకితం చేయబడింది. ఇది చాలా పురాతన ఆలయం. ఛత్రపతి శివాజీ కాలం నాటిదని సమాచారం. దీనిని పవిత్రమైన మూసీ నది ఒడ్డున ఆయన గురువు సమర్థ రామదాస్ స్వామి నిర్మించారు. పురాణాల ప్రకారం.. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి అన్వేషణలో ఉన్నప్పుడు ఈ ప్రదేశంలో ఆగి పూజలు చేశాడని నానుడి.

ఓపెనింగ్ టైమ్స్ : ఉదయం 6:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 4:00 నుంచి రాత్రి 9:30 వరకు

లొకేషన్ : కార్వాన్ ఈస్ట్, హైదరాబాద్

సమీప బస్ స్టాప్ : జియాగూడ KHT

Best Hill stations in Telangana and Andhrapradesh : తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్ట్​ స్పాట్లు.. ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

Tourist Places in Hyderabad : ఆతిథ్యం ఖుష్.. హైదరాబాద్‌ దిల్ ఖుష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.