ETV Bharat / bharat

కరోనా వచ్చిన వారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలో సంచలన నిజాలు!

Covid Impact On Male Fertility: కొవిడ్​ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని ఓ అధ్యయనం తెలిపింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తి ప్రోటీన్లు దెబ్బతింటాయని పరిశోధకులు వెల్లడించారు.

Covid Impact On Male Fertility
కరోనా వచ్చిందా..అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే!
author img

By

Published : Apr 11, 2022, 5:48 PM IST

Covid Impact On Male Fertility: కరోనా బారిన పడి కోలుకున్న పురుషులపై చేసిన అధ్యయనంలో మరో సంచలన విషయం వెల్లడైంది. కొవిడ్​ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని.. ఐఐటీ బొంబాయి చేసిన ఓ అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటాయని ఈ అధ్యయనం తెలిపింది. పురుషుల వీర్యకణాలపై చేసిన ఈ పరిశోధనను.. ఏసీఎస్​ ఒమెగా జర్నల్​ గతవారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్​ హాస్పిటల్, రీసెర్చ్​ సెంటర్​ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ​

కొవిడ్​కు కారణమైన సార్స్-2 వైరస్​ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. దాంతో పాటు ఇతర వ్యవస్థలను దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే, వైరస్​ కారణంగా పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని తాజాగా తేలినట్లు పేర్కొన్నారు. 10 మంది ఆరోగ్యవంతమైన పురుషుల వీర్యంతో పాటు 17 మంది కొవిడ్​ బారిన పడి కోలుకున్న వారి వీర్య నమూనాలను విశ్లేషించినట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పోల్చగా.. కరోనా సోకిన వారిలో వీర్య కణాలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్​1, ప్రోసాపోసిన్​ కోలుకున్న వారిలో తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెప్పారు. అయితే, వీటిని నిర్థరించడానికి మరిన్ని అధ్యయనాలు జరగాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.