covid surge in india: బ్రిటన్, ఫ్రాన్స్ తరహా పరిస్థితులు భారత్‌లోనూ నెలకొంటే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ హెచ్చరించారు. యూకే తరహా పరిస్థితులు ఏర్పడితే భారత్‌లో రోజుకు 14లక్షల కేసులు, ఫ్రాన్స్‌లా అయితే రోజుకు 13లక్షల కేసులు నమోదవుతాయన్నారు. యూరప్‌లో 80 శాతం మేర పాక్షికంగా టీకా పంపిణీ పూర్తైనా డెల్టా ఉద్ధృతి తగ్గడం లేదని పాల్ అన్నారు. అందువల్ల అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు సూచించారు.
టీకా వేసుకోవటం, మాస్క్ ధరించడం, శానిటైజర్ల వాడాలని ప్రజలకు సూచించారు. రద్దీప్రాంతాలకు దూరంగా ఉండాలని పాల్ కోరారు. నూతన సంవత్సర వేడుకలను కొద్దిమంది సమక్షంలో జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. 20 రోజులుగా దేశంలో కొవిడ్ కేసులు 10వేల కన్నా తక్కువే అయినా ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వీకే పాల్ గుర్తు చేశారు.
ఇదీ చూడండి: Covid Cases in India: దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు