ప్రపంచంలో అతి పెద్ద టీకా ఉత్పత్తిదారుగా భారత్ వ్యూహాత్మక పాత్రను గుర్తిస్తున్నట్లు ఐరోపా కూటమి ప్రకటించింది. ఐరోపా కూటమి, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి తొలి అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. భారత్‌తో వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై పూర్తిస్థాయిలో ఏ దాపరికాలు లేకుండా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈయూ తెలిపింది.
సార్వత్రిక, సమ దృష్టితో పాటు అందుబాటు ధరలో సురక్షిత టీకాను అందించడమే భారత్-ఈయూ ప్రాధాన్య అంశమని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. వర్చువల్గా జరిగే ఈ చర్చలకు భారత్ ఆతిథ్యమిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా అంతానికి నిర్దేశించుకున్న కొవాక్స్ కార్యక్రమం విజయవంతమవ్వాలంటే ఐరోపా కూటమి మద్దతు తప్పనిసరని పేర్కొంది కేంద్రం. అప్పుడే కోట్లాది ప్రాణాలు రక్షించగలమని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. భారత్ కరోనాని సమర్థంగా ఎదుర్కొందని, ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి 'వీ' ఆకారంలో పుంజుకుంటోందని ఈయూకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేశ ఆరోగ్య రంగం పటిష్ఠం: రాష్ట్రపతి