ETV Bharat / bharat

గయాలో 'తిల్​కుట్'​- రుచి చూస్తే దిల్​ ఖుష్​!

తిల్​కుట్​.. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ సంప్రదాయ తీపి వంటకం బిహార్​లోని గయాలో చాలా ఫేమస్​. దీని రుచికి ఫిదా అవ్వని వారే ఉండరేమో! అందుకే.. గత 200 ఏళ్లుగా అక్కడ ఈ వ్యాపారం భారీగా సాగుతోంది. రోజుకు గయా వ్యాప్తంగా 50 క్వింటాళ్ల తిల్​కుట్​ అమ్ముడవుతోంది. మరి ఈ మిఠాయికి గయాలో ఇంతటి ఆదరణ ఎలా దక్కిందో ఇప్పుడు చూద్దాం.

bihar gaya thilkut
గయాలో 'తిల్​కుట్'​ రుచి చూస్తే దిల్​ ఖుష్​ అవాల్సిందే!
author img

By

Published : Jan 18, 2021, 1:59 PM IST

గయాలో 'తిల్​కుట్'​- రుచి చూస్తే దిల్​ ఖుష్​!

లిట్టీ చోఖా..! ఈ ప్రముఖ సంప్రదాయ వంటకమంటే ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఎంతో ఇష్టం. ఇదే కాదు.. మనేర్ లడ్డూ, సిలావ్‌ ఖాజా లాంటి మిఠాయిలకు బిహార్ ప్రసిద్ధి. ఈ మిఠాయిలను ఎవ్వరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. గయాలో గత 200 ఏళ్లుగా తిల్‌కుట్ వ్యాపారం భారీగా సాగుతోంది. నువ్వులను బెల్లంతో కలిపి చేసే ఈ మిఠాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

గయావ్యాప్తంగా రోజుకి 50 క్వింటాళ్ల తిల్‌కుట్ అమ్ముడవుతోంది. ఇక్కడికి వచ్చే విదేశీయులూ తమతోపాటు తిల్‌కుట్‌ను తీసుకెళ్తారు. మధురమైన రుచి, సువాసన ఈ మిఠాయి సొంతం. మొదటిసారిగా గయాలోని రమణా రోడ్‌లో తయారైన ఈ వంటకం.. తీపిప్రియుల మనసుల్లో ప్రత్యేక ముద్ర వేసింది. రమణ రోడ్‌లోకి ప్రవేశించగానే తిల్‌కుట్ తయారుచేసే శబ్దాలు వినిపిస్తాయి. నువ్వులను వేడి పెనంపై వేయిస్తుంటే వచ్చే చిటపట శబ్దం వినియోగదారుల్లో ఆకలి పెంచుతుందనడం అతిశయోక్తి కాదు. కరకరలాడే తిల్‌కుట్‌ను అభిమానించే వారు ఎక్కువే.

"రమణా రోడ్‌లో ప్రతిసారీ తిల్‌కుట్ కొంటాను. ఈ మిఠాయి చాలా ప్రత్యేకం. తినేటప్పుడు కరకరలాడుతుంది."

-- యోగేంద్ర ప్రసాద్, స్థానికుడు

ఏడాది పొడవునా తిల్‌కుట్ లభిస్తుంది. కానీ డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు వ్యాపారం అధికంగా జరుగుతుంది. విదేశాలకూ ఈ మిఠాయి ఎగుమతి అవుతుంది. తిల్‌కుట్ తయారీకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ముత్తాతల నుంచి నేర్చుకుని, గోపీషా అనే వ్యక్తి తిల్‌కుట్‌ తయారీకి శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెప్తారు. గయా నగరంలో 200 వరకూ తిల్‌కుట్ దుకాణాలున్నాయి. పరోక్షంగా 20 వేల మందికి పైగా ఈ మిఠాయిపై ఆధారపడి జీవిస్తున్నారు.

"రమణారోడ్‌లోనే తిల్‌కుట్ మొదటిసారి తయారైంది. జక్రీ మహారాజ్, గయా బాల్ పాండా లాంటి సంపన్నులు తిల్‌కుట్‌ను అమితంగా ఇష్టపడేవారు. వాళ్లే ఈ మిఠాయికి ప్రచారం కల్పించారు. మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రసిద్ధి చెందింది తిల్‌కుట్. భౌగౌళిక గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ వృత్తిపై ఆధారపడి 5 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏడాది పొడవునా వ్యాపారం నడవకున్నా, ప్రభుత్వం చొరవ తీసుకుంటే నిరంతరాయంగా కొనసాగుతుంది."

--లాల్జీ ప్రసాద్, దుకాణం యజమాని

అధికారిక వివరాల ప్రకారం రోజుకు 2 కోట్ల రూపాయల విలువైన 50 క్వింటాళ్ల తిల్‌కుట్ అమ్ముడవుతోంది. గయా శివార్లలోనూ విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మిఠాయి తయారీ కొంచెం ప్రయాసతో కూడుకున్నదే.

"పంచదార లేదా బెల్లంతో పాకం తయారుచేస్తాం. చల్లబడ్డాక చెక్క కొయ్యపై వేలాడదీస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వులను వేయించి, పాకంలో కలుపుతాం. చివరగా ఇనుప కడ్డీని గానీ, చెక్క కొయ్యను గానీ ఉపయోగించి, మిఠాయిని కావల్సిన ఆకారంలోకి మలుస్తాం."

--మనీష్ కుమార్, తయారీదారు

తిల్‌కుట్‌లో రకరకాల వెరైటీలుంటాయి. చక్కెర లేని తిల్‌కుట్ కూడా అందుబాటులో ఉంది.

"వివిధ రకాల తిల్‌కుట్ మా వద్ద ఉంటుంది. చక్కెర, బెల్లం, కోవా రకాలు ఉంటాయి. మిఠాయిలు ఇష్టంగా తినే మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం చక్కెర లేని తిల్‌కుట్ కూడా ఉంది."

--నిక్కు కుమార్ షా, దుకాణం యజమాని

వ్యాపారస్థుల్లో చాలామంది ఆన్‌లైన్‌ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. రాంచి, కోల్‌కతా, హైదరాబాద్, దిల్లీ సహా దేశవ్యాప్తంగా ఎన్నో నగరాలకు తిల్‌కుట్ చేరువవుతోంది. జొమాటో లాంటి డెలివరీ సంస్థల ద్వారా తిల్‌కుట్‌ విక్రయాలు సాగుతున్నాయి.

ఇదీ చూడండి:జీవనకాలం పెరగాలంటే ఇవి తినాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.