ETV Bharat / bharat

Warangal Floods 2023 : ఏ ఇంట చూసినా 'వరద' విషాదమే.. ఇంకా జల దిగ్బంధంలోనే ఓరు'ఘొల్లు'వాసులు - వరంగల్​లో వర్షాలు

Floods Effect in Warangal : వరంగల్‌లోని పలు కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. వర్షాలు, వరదలు సృష్టించిన ప్రళయానికి 680కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. హనుమకొండ, వరంగల్ నగరాల్లో రూ.414 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 200 కాలనీలకు పైగా ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. నేటి నుంచి వరద బాధితులకు సహాయం అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

Warangal Floods 2023
Warangal Floods 2023
author img

By

Published : Jul 30, 2023, 9:44 AM IST

గ్రేటర్‌ వరంగల్‌లో ఇంకా జలదిగ్బంధంలోనే 200 కాలనీలు.. నేటి నుంచి వరద బాధితులకు సాయం

Floods Effect in Warangal 2023 : ఇంటి చుట్టూ నీరు.. వీధులన్నీ ఏరులే అన్నట్లుగా త్రినగరి పరిస్థితి మారింది. గ్రేటర్‌ వరంగల్‌లో 1200 కాలనీలు ఉండగా.. వరంగల్‌లో 150 కాలనీలు.. హనుమకొండ, ఖాజీపేటల్లో 50 కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు.. కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇప్పటికీ సంతోషిమాత కాలనీ 2, బృందావనీ కాలనీ, సాయినగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు.. జల దిగ్భందనంలోనే ఉన్నాయి. ఇక వరద తగ్గాక.. పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారు.. ఇళ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. కూలిపోయిన ఇళ్లు చూసి నోట మాట లేకుండా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లలోని బియ్యం సహా నిత్యావసర సామగ్రి తడిసిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గినా ఇంట్లో చేరిన బురదతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు.

Errabelli Dayakar Rao on Flood Damage Warangal : వరంగల్, హనుమకొండ పరిధిలో 680కి పైగా ఇళ్లు నేలకూలాయి. రహదారులు, కల్వర్టులు, కాల్వలు దెబ్బతినగా రూ.177 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రెండు నగరాల్లో వరద నష్టం రూ.414 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరదల్లో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.

గతంలో మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు నాలాలు కట్టడం వల్ల ఇబ్బంది జరిగిందని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పెడితే కొన్ని తీసేశాం. నాలాలు ఇప్పుడు కాదు ఇచ్చింది.. ముప్పై, నలబై సంవత్సరాల కింద గత ప్రభుత్వాలు పర్మిషన్​లు ఇచ్చాయి. కాగితాలు కూడా సృష్టించి తీసుకున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు. ప్రాణనష్టం లేకుండా వీలున్న కాడికి అందరినీ కాపాడగలిగాం. -ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

Flood Victims Problems in Warangal : వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వరద నష్టంపై అధికారులతో మంత్రి సమీక్షించారు. అధికారులంతా బాగా కష్టపడ్డారని ప్రశంసిస్తూ.. గంటలోపుగానే భద్రకాళీ చెరువు గండి పూడ్చి వేశారంటూ అందుకు ఉదాహరణగా చెప్పారు. మరోవైపు.. నగర పరిధిలో పలు కాలనీలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలోనే ఉన్నాయి. వరదలు మిగల్చిన నష్టం నుంచి తేరుకునేందుకు.. ఓరుగల్లు వాసులకు చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఏ ఇంట చూసినా.. వరద నింపిన విషాదమే కనిపిస్తోంది. ఊరిని ముంచెత్తిన భారీ వరదల నుంచి ప్రాణాలతో బయటపడిన గ్రామస్థులు.. తమ ఇళ్ల ప్రస్తుత పరిస్థితులు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఉన్న కాస్త గూడూ వరదల ధాటికి దెబ్బతినడంతో 'ఎట్లా బతికేదీ' అంటూ ఆందోళన చెందుతున్నారు. బాధితులను పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించి ధైర్యం చెప్పినా.. వరద తాలూకు భయానక దృశ్యాల నుంచి వారింకా బయటకు రాలేకపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.