ETV Bharat / bharat

తమిళ సీఎం 'రైతు' అవతారం ఎన్నికల్లో లాభించేనా! - తమినాడు ముఖ్యమంత్రి పళనిస్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి ఇటీవలి కాలంలో రైతు వేషధారణపై దృష్టి సారించారు. తుపాను కారణంగా నీట మునిగిన ప్రాంతాలను సందర్శించే సమయంలో దోతీ మడిచి, బురద పొలాల్లోకి దిగి రైతులతో నేరుగా మాట్లాడారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని ఓ సందర్బంలో అన్నారు. అయితే రైతుల నుంచి ప్రభుత్వంపై వస్తోన్న వ్యతిరేకతను చెరిపేసేందుకు సీఎం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఫొటోలకు పోజులిచ్చినంత మాత్రాన ఓట్లు రాలవని విశ్లేషకులు అంటున్నారు.

EPS' Image Makeover as a Farmer: Will this help AIADMK win 2021 Assembly Polls?
తమిళ సీఎం రైతు అవతారం ఎన్నికల్లో లాభించేనా!
author img

By

Published : Dec 27, 2020, 9:21 AM IST

ప్రతికూలతను అవకాశంగా మర్చుకునే విషయంలో మన నేతలది అందెవేసిన చెయ్యి. తమిళనాడు మఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కూడా ఇందుకు మినహాయింపేం కాదు. రాష్ట్రంలో తుపాను కారణంగా కావేరీ డెల్టా ప్రాంతమైన కుడ్డలోర్​ నుంచి నాగపట్టణం వరకు తీవ్ర పంటనష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పళనిస్వామి వేషధారణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను సందర్శించే సమయంలో ఆయన దోతీని మడిచి, బురదను కూడా లెక్క చేయకుండా వ్యవసాయ క్షేత్రంలోకి దిగి రైతులతో నేరుగా మాట్లాడారు.

EPS' Image Makeover as a Farmer: Will this help AIADMK win 2021 Assembly Polls?
పంటలను పరిశీలిస్తోన్న పళనిస్వామి

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తాను కూడా రైతుననే భావనను ప్రజల్లో కలగించేందుకే పళనిస్వామి ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

EPS' Image Makeover as a Farmer: Will this help AIADMK win 2021 Assembly Polls?మహిళలకు పళనిస్వామి అభివాదం

అప్పుడలా..

రెండేళ్ల క్రితం తమిళనాడులో గజా తుపాను అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో ప్రత్యేక చాపర్​లో వెళ్లి డెల్టా ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు పళనిస్వామి. ఆయన తీరుపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు రైతు అవతారంపై కొద్ది నెలల క్రితం నుంచే దృష్టి సారించారు పళనిస్వామి. డీఎంకే పట్టణ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఓ టీవీ కార్యక్రమంలో వరి నాటుతూ కన్పించారు. పొలం మధ్యలో నిల్చొని ఓ చేత్తో కొడవలి మరో చేత్తో వరి పైరు పట్టుకుని అచ్చం రైతులా ఫోజులిచ్చారు. ఇదంతా జరిగింది ఆయన సొంత నియోజకవర్గం ఎడప్పాడిలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్​తో కలిసి పుదుకొట్టాయ్ జిల్లాలో జల్లికట్టు పోటీలను కూడా ప్రారంభించారు.

EPS' Image Makeover as a Farmer: Will this help AIADMK win 2021 Assembly Polls?
తమిళ సీఎం రైతు అవతారం ఎన్నికల్లో లాభించేనా!

అయితే పళనిస్వామి ఇవన్నీ రైతు ఇమేజ్​ కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీటిని ఏఐఏడీఎంకే ఖండించింది. రైతు కుటుంబం నుంచే వచ్చిన పళనిస్వామికి ఆ అవసరం లేదని పార్టీ ఐటీ వింగ్​ స్పష్టం చేసింది.

ఇటీవల ఓ సందర్భంలో 'నేను స్వతహాగా రైతును. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​కు వ్యవసాయం గురించి ఏం తెలుసు?' అని పళనిస్వామి అన్నారు.

" ఆయన తన లాగే ఉన్నారు. ఇమేజ్ మార్చుకోవాల్సిన అవసరం సీఎం పళనిస్వామికి లేదు. వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. ఇతర నేతల్లా ఆయన మూలాలను మర్చిపోయే వ్యక్తి కాదు. రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పార్టీకి కచ్చితంగా వారు ఓటేస్తారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటనను రాజకీయ కోణంలో చూడవద్దు"

-ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి శివశంకరి

సాగు చట్టాలకు మద్దతు..

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన సమయంలో ఏఐఏడీఎంకే వాటికి మద్దతు తెలిపింది. తాను రైతునని చెప్పుకొనే పళనిస్వామి.. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చుతాయని ప్రశంసించారు. అప్పటికే భారత్​మాలా ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి సాలెం వరకు గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​వే సమీపంలోని డెల్టా ప్రాంతాల వ్యవసాయ క్షేత్రాల నుంచి పైపులైన్లు, టవర్​లైన్లు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే పళనిస్వామి రైతు ఇమేజ్​ కోసం తాపత్రయ పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే ఏఐఏడీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పళనిస్వామి చేస్తోన్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

మీడియాలో ఆర్బాటమే..

పళనిస్వామి రైతు ఇమేజ్​ కోసం చేస్తోన్న ప్రయత్నాలు మీడియాలో ప్రచారానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప.. ఓట్లు రాబట్టవని విశ్లేషకులు చెబుతున్నారు.

" విధి విధానాలతో సంబంధం లేకుండా ఏఐఏడీఎంకేను ఎప్పుడూ ఆదరించే కొన్ని వర్గాల ప్రజలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీపీఐకి డెల్టా ప్రాంతాల్లోని గ్రామాల్లో మంచి ఆదరణ ఉంది. డీఎంకే, సీపీఐ, సీపీఐఎం, కాంగ్రెస్​ కూటమికి ఈ ప్రాంతాల్లో మద్దతు బలంగా ఉంది. ఆ కూటమిని చూసి ఏఐడీఎంకే భయపడుతోంది. అందుకే రైతు అవతారంలో మీడియా ముందు ఈ హడావిడి. ఇలాంటి ఫొటోలు చూసి ప్రజలు ఓట్లు వేయరు."

-ఆర్​.తిరుణవాకురసు, హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​.

ఇదీ చూడండి: తమిళులపై 'ఎమ్​జీఆర్​' అస్త్రం ప్రభావమెంత?

తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.