కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు అనంతర పరిస్థితులను తెలుసుకునేందుకు.. 24 దేశాలకు చెందిన రాయబారుల బృందం అక్కడ పర్యటించింది. ఈ మేరకు దాల్ సరస్సు కన్వెన్షన్ హాల్లో సంగీత కళాకారులు, రచయితలతో సమావేశమై.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత బుద్గాం జిల్లాలోని మాగామ్ను సందర్శించిన అధికారులు.. స్థానిక పాలనా యంత్రాంగం ప్రతివారం నిర్వహించే 'బ్లాక్ దివస్'ను పరిశీలించారని అధికారిక వర్గాలు తెలిపాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర అధికారులు, రాజకీయ నాయకులు వీరితో పాటు ఉన్నారు.
-
#WATCH Foreign envoys visit Hazratbal shrine in Jammu and Kashmir's Srinagar
— ANI (@ANI) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Envoys from 24 nations are part of the delegation visiting the Union Territory. pic.twitter.com/C6H3OI5WL6
">#WATCH Foreign envoys visit Hazratbal shrine in Jammu and Kashmir's Srinagar
— ANI (@ANI) February 17, 2021
Envoys from 24 nations are part of the delegation visiting the Union Territory. pic.twitter.com/C6H3OI5WL6#WATCH Foreign envoys visit Hazratbal shrine in Jammu and Kashmir's Srinagar
— ANI (@ANI) February 17, 2021
Envoys from 24 nations are part of the delegation visiting the Union Territory. pic.twitter.com/C6H3OI5WL6
హజ్రత్బల్ సందర్శన..
అనంతరం.. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్‌ను సందర్శించిన రాయబారులు ఆ మసీదు చారిత్రక ప్రాముఖ్యత గురించి అక్కడి కళాకారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎన్నికైన ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారని శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జునైద్ మట్టు తెలిపారు. అక్కడి పరిస్థితులు, స్వేచ్ఛా వాతావరణంలో జరిగిన ఎన్నికల(డీడీసీ)ను గురించి స్థానికులు అధికారులకు వివరించినట్టు జునైద్ చెప్పారు.
తొలి రోజు పర్యటన అనంతరం.. స్థానిక ప్రజల ప్రతిస్పందనను బట్టి కేంద్ర పాలనా యంత్రాంగం పట్ల వారు సుముఖంగా ఉన్నారని దిల్లీలోని బొలీవియా రాయబారి జువాన్ జోస్ కార్టెజ్ రోజస్ వెల్లడించారు.
బ్రెజిల్, ఇటలీ, ఫిన్లాండ్, క్యూబా, చిలీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, కిర్గిస్థాన్, ఐర్లాండ్, ఘనా, ఎస్టోనియా, బొలీవియా, మలావి, ఎరీట్రియా, ఐవరీ కోస్ట్ దేశాల ప్రతినిధుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. భద్రత దృష్ట్యా మలేసియా, బంగ్లాదేశ్, సెనెగల్, థజకిస్థాన్ వంటి ఇస్లామిక్ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబారులను మాగామ్కు పంపినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో భారీ ఉగ్రకుట్న భగ్నం