కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నా, లేదా పడకల సామర్థ్యం 60 శాతం దాటినా.. ఆ జిల్లాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి.. కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఆదేశించింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్సుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించింది.
కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూలను విధించాలని సూచించింది. ప్రజలు అధిక సంఖ్యలో గుమికూడటం నిషేధించింది. పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని.. అంత్యక్రియలు అయితే 20 మందికి మించి హాజరు కావొద్దని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు మే 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే లాక్డౌన్పై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కేంద్ర హోం శాఖ.
ఇదీ చదవండి : ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ