దేశంలో కరోనా టీకా డోసుల కొరత నేపథ్యంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. జులై-ఆగస్టు కల్లా దేశంలో అందరికీ సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.
"వ్యాక్సిన్లపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేస్తోంది. ఇది చాలా బాధాకరమైన విషయం. జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి."
- నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాక మంత్రి
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కాంగ్రెస్ తమ పాలనలో ఎదుర్కోలేదని తోమర్ అన్నారు. గ్వాలియర్‌లోని ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో 1000 పడకల కొవిడ్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అది ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:బురద గుంటలో ఏనుగు- జేసీబీ సాయంతో బయటకు!