ETV Bharat / bharat

మహిళల కోసం నిర్భయ బ్రేస్​లెట్.. దాడి చేస్తే కరెంట్ షాక్​.. ఐదు నంబర్లకు మెసేజ్!

మహిళల భద్రత కోసం ఓ వినూత్న పరికరాన్ని రూపొందించారు ఇద్దరు విద్యార్థినులు. ఆపద వచ్చినప్పుడు అయిన వారికి సమాచారం చేరవేసేందుకు వీలుగా దీన్ని తయారు చేశారు. కరెంట్​ షాక్​ సైతం వచ్చే విధంగా రూపకల్పన చేశారు.

engineering students innovate Woman Safety Device
ఉమెన్​ సేఫ్టీ డివైస్ తయారు చేసిన విద్యార్థినులు
author img

By

Published : Nov 29, 2022, 3:11 PM IST

మహిళల కోసం నిర్భయ బ్రేస్​లెట్.. దాడి చేస్తే కరెంట్ షాక్​.. ఐదు నంబర్లకు మెసేజ్!

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇంజినీరింగ్​ విద్యార్థినులు ఓ వినూత్న పరికరం తయారు చేశారు. అనుకోని ఆపద వచ్చినప్పుడు మనకు కావాల్సిన వాళ్లకు సమాచారం చేరవేయడమే కాకుండా.. దుండగులను ఎదుర్కొనేలా ఈ డివైజ్​ను రూపొందించారు. ఈ పరికరం.. చేతికి బ్రేస్​లెట్ లేదా ఉంగరంలా ధరించేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

ఉత్తర్​ ప్రదేశ్​ గోరఖ్‌పుర్ జిల్లాలోని​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ​చదువుతున్న స్నేహ, అక్షిత ఈ పరికరాన్ని తయారుచేశారు. దీన్ని లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు అందులోంచి కరెంట్​ విడుదలై షాక్​ కొట్టేలా బ్యాటరీని ఏర్పాటు చేశారు.

engineering students innovate Woman Safety Device
ఉమెన్​ సేఫ్టీ డివైజ్ తయారు చేసిన విద్యార్థినులు

ఈ డివైజ్ ఫోన్​ ద్వారా ఉమెన్​ సేఫ్టీ యాప్​కు అనుసంధానమై ఉంటుంది. మరో ఐదు నంబర్లకు కనెక్ట్​ అయి ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైనప్పుడు పరికరంలోని బటన్​ను రెండు సార్లు నొక్కాలి. వెంటనే ఆ నంబర్లకు కాల్​తో సహా ఒక మెసేజ్​ వెళుతుంది. ప్రస్తుతం ఉన్న లొకేషన్​ సైతం షేర్​ అవుతుంది. దీంతో వారు ఘటన స్థలానికి త్వరగా చేరుకోవచ్చు.

- స్నేహ, విద్యార్థిని

ఈ పరికరం బ్లూటూత్​ ద్వారా పనిచేస్తుంది. దీంట్లో ఒక బ్యాటరీ, రాగి వైర్లు ఉంటాయి. ఇవి ప్రమాద సమయంలో ఇతరులకు షాక్​ కొట్టించేందుకు ఉపయోగపడతాయి. దీని ధర రెండు వేల రూపాయలు.

- అక్షిత, విద్యార్థిని

మహిళలకు రక్షణగా ఉండే పరికరం తయారు చేసినందుకు ఆ ఇద్దరు అమ్మాయిలకు కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, తోటి విద్యార్థుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పరికరానికి పేటెంట్​ హక్కులు వచ్చేల ప్రయత్నాలు చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.