ETV Bharat / bharat

యువ ఇంజినీర్​ అవయవదానం- నలుగురి జీవితాల్లో వెలుగు - యువ ఇంజినీర్ అవయవదానం

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడు.. నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ప్రమాదంలో బ్రెయిన్​డెడ్​ అయిన అతడి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి.. తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Engineer who died in an accident: Give life to four people
మరణించి నలుగురి జీవితాల్లో వెలుగు నింపిన ఇంజినీర్​
author img

By

Published : Mar 11, 2021, 11:58 AM IST

కర్ణాటక మైసూర్​లో ఇంజినీర్​గా పనిచేస్తున్న యువకుడి కుబుంబ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్​ డెడ్​ అయిన అతడి అవయవాలను వైద్యుల సూచన మేరకు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఫలితంగా మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.

ఇదీ జరిగింది..

ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చందన్ అనే యువ ఇంజినీర్​ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మైసూర్​లోని అపోలో బీజీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజులపాటు ఐసీయూలో కృత్రిమ శ్వాసపై ఉన్న చందన్ బ్రెయిన్​డెడ్​ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయినా ఇతరుల్లో తిరిగి జీవించవచ్చని తెలిపిన వైద్యులు.. చందన్​ కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. కుటుంబ సభ్యులు అంగీకరించిన నేపథ్యంలో గుండె, మూత్రపిండాలు, కాలేయం సేకరించిన వైద్యులు.. నలుగురికి అమర్చారు.

ఇదీ చదవండి: కథ సుఖాంతం.. కన్నతల్లి చెంతకు గీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.