ETV Bharat / bharat

తల్లి ఏనుగు మృతి.. దిక్కుతోచక అక్కడక్కడే తిరుగుతున్న పిల్ల ఏనుగులు

author img

By

Published : Mar 11, 2023, 10:10 AM IST

మనుషులకే కాదు జంతువులకు కూడా తల్లి ప్రేమ అనేది అపురూపమైనది. ఒక్కరోజు తల్లి కనిపించకపోతే మనకు ఏదోలా ఉంటుంది. చిన్నపిల్లలైతే తమ ప్రపంచమంతా తల్లి వద్దే ఉంటుంది. తల్లి దూరమైతే ఆ బాధ మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు తమిళనాడులో రెండు ఏనుగు పిల్లలు సైతం ఇదే బాధలో ఉన్నాయి. తమ తల్లి కోసం వెతుకుతూ అడవుల్లో తిరుగుతున్నాయి.

Elephant calves suffering from the loss of their mother in tamilanadu
తల్లిని కోల్పోయిన రెండు ఏనుగు పిల్లలు..నిఘా పెంచిన అటవీ శాఖ

తమిళనాడులో రెండు ఏనుగులు తమ తల్లి కోసం వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతున్నాయి. తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలియక... అవన్నీ దిక్కుతోచని స్థితిలో సంచరిస్తున్నాయి. పంట పొలాల చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ఆ తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇంకో రెండు ఏనుగులు సైతం ఆ ఘటనలో చనిపోయాయి. ఏనుగు పిల్లలు మాత్రం.. తమ తల్లి ఇంకా బతికే ఉందని రోజూ అవి వెళ్లిన చోటికి వెళ్లి వాటి అమ్మ కోసం వెతుకుతున్నాయి. అటవీ శాఖ అధికారులు.. ఆ ఏనుగు పిల్లలను మిగతా ఏనుగుల గుంపుతో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో పాలకోడు ఫారెస్ట్‌ రిజర్వ్‌, మారండహళ్లి సమీపంలో ఐదు ఏనుగులు సంచరించేవి. అందులో 2 ఆడ, ఒక మాగ్నా(థర్డ్​ జెండర్) ఏనుగుతో పాటు 2 పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఇటీవల ఇవన్నీ కలిసి కొట్టాయ్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లాయి. అక్కడ ఆహారం కోసం పంట పొలాల్లోకి ప్రవేశించాయి. అయితే ఆ పంట పొలం చుట్టూ విద్యుత్ కంచె వేశారు. ఆహారం కోసం పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు వెళ్లిన ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. ఆ క్రమంలో ఏనుగులు కంచెకు తాకడం వల్ల విద్యుదాఘాతంతో మొత్తం 3 ఏనుగులు (2 ఆడ, ఒక మాగ్నా ఏనుగు) మార్చి 8న మరణించాయి. వీటితో పాటు రెండు పిల్ల ఏనుగులు వచ్చాయి. కానీ అవి ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.

అయితే ఈ ఏనుగులతో పాటు వచ్చిన 2 ఏనుగులు తమ తల్లి చనిపోయాయని తెలియక అదే ప్రాంతంలో వాటి తల్లికోసం వెతుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాయి. తల్లి ఏనుగు కనిపిస్తుందేమో అనే ఆశతో పిల్ల ఏనుగులు అవి తిరిగిన ప్రాంతానికి వచ్చి చూసి వెళుతున్నాయి. ఈ రెండు ఏనుగులను సురక్షితంగా రక్షించి ఏనుగుల గుంపుతో ముదుమలై అభయారణ్యంలో విడిచిపెట్టాలని అటవీ శాఖకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

దీంతో ధర్మపురి జిల్లా అటవీశాఖ జిల్లా అటవీ అధికారి అపోలో నాయుడు ఆధ్వర్యంలో మండల అటవీ విభాగం అధికారి విన్సెంట్‌, వైద్యుడు ప్రకాశ్‌, పాలకోడు ఫారెస్ట్‌ రేంజర్‌ నటరాజ్‌, వేటగాళ్ల నిరోధక సిబ్బంది గత రెండు రోజులుగా ఏనుగులపై నిఘా పెట్టారు. అలాగే పుచ్చకాయ, జాక్‌ఫ్రూట్, గ్లూకోజ్, నీరు వంటి పలు రకాల ఆహార పదార్థాలు పెట్టి అటవీశాఖ.. ఏనుగులను కాపాడుతూ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆహారం కోసం ఏనుగులు వచ్చినప్పుడు వాటిని సురక్షితంగా పట్టుకొని ఇతర ఏనుగుల గుంపులో కలపాలని అటవీశాఖ యోచిస్తుంది.

అయితే తల్లిని కోల్పోయిన రెండు ఏనుగులు మళ్లీ తల్లి ఉన్న చోటికి వచ్చి వాటి కోసం వెతుకుతున్నాయి. ఏనుగులు మృతి చెందిన రెండు రోజుల తర్వాత ఏనుగులు చనిపోయిన ప్రాంతంలోని కాళ్లకారం సమీపంలో రెండు ఏనుగులు సంచరించాయి. దీనిపై ధర్మపురి, కృష్ణగిరి జిల్లా అటవీశాఖకు చెందిన 30 మందికి పైగా నిరంతరం ఏనుగులను పర్యవేక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.