ETV Bharat / bharat

కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని మీటర్‌ రీడింగ్‌ తీసే ఉద్యోగి హత్య.. ఆయుధాలతో వెంబడించి మరీ దారుణం - విద్యుత్ మీటర్ రీడర్‌ను చంపిన వినియోగదారుడు

Electricity Employee Murder : ఒడిశాలో మీటర్‌ రీడింగ్‌ తీసే ఉద్యోగిని హత్య చేశాడు ఓ వ్యక్తి. కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్యకు ముందు కొంత మంది ఆగంతుకులు బాధితుడ్ని వెంబడించారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి.. విద్యుత్​ ఉద్యోగిని చంపాడు.

Electricity Employee Murder
కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని మీటర్‌ రీడింగ్‌ తీసే ఉద్యోగి హత్య
author img

By

Published : Aug 7, 2023, 5:28 PM IST

Electricity Employee Murder : కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని మీటర్‌ రీడింగ్‌ తీసే ఉద్యోగిని హత్య చేశాడు ఓ విద్యుత్​ వినియోగదారుడు. ఒడిశాలోని గంజామ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హత్యకు ముందు కొంతమంది ఆగంతుకులు బాధితుడ్ని వెంబడించారు. వారిలోని ఓ వ్యక్తి.. మీటర్‌ రీడింగ్‌ తీసే ఉద్యోగిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. సోమవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

గ్యాలరీ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్‌ త్రిపాఠీ అనే విద్యుత్‌ ఉద్యోగి.. కరెంట్​ మీటర్ల రీడింగ్‌ కోసం కుపాటి అనే గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో కొంత మంది ఆగంతుకులు అతడ్ని వెంబడించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న త్రిపాఠీ.. అనంతరం ఓ ఇంటికి వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీస్తున్నాడు. అదే సమయంలో ఆగంతుకులు కూడా మళ్లీ అక్కడకు వచ్చారు. ఆ గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో త్రిపాఠీపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ త్రిపాఠీ.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న త్రిపాఠీ మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. "త్రిపాఠీ ఎలాంటి తప్పు చేయలేదు. అతడ్ని అన్యాయంగా హత్య చేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి." అని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు. ఘటనపై మీటర్ రీడర్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

దిల్లీలో దారుణం.. యువతి తలపై రాడ్​తో కొట్టి హత్య.. పెళ్లికి నో చెప్పినందుకే!
Delhi Student Killed : పది రోజుల క్రితం పట్టపగలే పార్కులో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు దుండగుడు. బెంచ్‌పై కూర్చున్న యువతి తలపై వెనక నుంచి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. దిల్లీ మాలవీయనగర్ శివాలిక్‌లోని విజయ్ మండల్ పార్క్‌లో ఘటన జరిగింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యువకుడి దాడితో యువతి తల పగిలి ఆ ప్రాంతమంతా రక్తం పారింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Youth died after car explodes : భారీ శబ్దంతో కారులో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం.. వాహనం దగ్ధం

రన్నింగ్ ట్రైన్​లో రేప్​.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.