ETV Bharat / bharat

ఇంజినీరింగ్​ కాలేజీలో కరెంట్​​ షాక్​.. నలుగురు మృతి

కళాశాలలో రంగులు వేస్తున్న నలుగురు కరెంట్ షాక్​తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్ర, అమరావతిలోని కోటి ఇంజినీరింగ్​ కాలేజీలో జరిగింది.

electric shock death
పెయింటింగ్​ చేస్తుండగా కరెంట్​​ షాక్​
author img

By

Published : Dec 29, 2021, 2:15 PM IST

Updated : Dec 29, 2021, 2:29 PM IST

electric shock death: మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్​ షాక్​ తగిలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లా కేంద్రానికి సమీపంలోని కతోరా ప్రాంతంలో ఉన్న కోటి ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశమార్గానికి రంగులు వేస్తున్నారు. పైకి చేరుకునేందుకు ఇనుప రాడ్లతో ఏర్పాటు చేసుకున్న స్టాండు.. ​ పైన ఉన్న హైఓల్టేజ్​ విద్యుత్తు తీగలకు తగిలింది. దానిపైనే ఉన్న నలుగురికి విద్యుత్తు ప్రసరణ జరిగి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాద చాయలు అలుముకున్నాయి.

electric-shock-death
సంఘటనాస్థలంలో మృతులు

గాడ్గేనగర్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతదేహాలను పొస్ట్​మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

electric shock death
కళాశాలలో బందోబస్తు

ఇదీ చూడండి: హెచ్​ఐవీ గర్భిణీ డెలివరీకి వైద్యుల నిరాకరణ.. బైక్​పైనే ఇంటికి తీసుకెళ్లి..

Last Updated : Dec 29, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.