ETV Bharat / bharat

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదా!

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణ సరి కాదని సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తదుపరి షెడ్యూల్​ని పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ నిర్ణయిస్తుందని పేర్కొన్నాయి.

Congress
కాంగ్రెస్​
author img

By

Published : May 10, 2021, 3:40 PM IST

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగానే వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించటం సరి కాదని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. గత సీడబ్ల్యూసీ సమావేశంలో, కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జూన్​ 23న చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపాయి.

ఎన్నికల తదుపరి షెడ్యూల్​ను కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల అథారిటీ నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

జూన్​ చివరి నాటికి అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేయాలని గతంలో నిర్ణయించింది పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ. ఈ విషయాన్ని సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభ ప్రసంగంలో వెల్లడించారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. " జనవరి 22న సమావేశమై.. జూన్​ చివరి నాటికి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించాం. ఎన్నికల అథారిటీ ఛైర్​పర్సన్​ మధుసుదన్​ మిస్త్రీ జీ.. షెడ్యూల్​ రూపొందించారు. ఎన్నికల ఫలితాలు, కొవిడ్​-19పై చర్చల తర్వాత ఆ వివరాలను వేణుగోపాల్​ మీకు తెలియజేస్తారు. " అని పేర్కొన్నారు.

అయితే.. కరోనా ఉద్ధృతి సమయంలో ఎన్నికలు నిర్వహించటం సరైన నిర్ణయం కాదని పార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల సూచనల మేరకు మరోమారు వాయిదా వేసేందుకే సీడబ్ల్యూసీ మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చూడండి: 'టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.