ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికల భద్రతపై ఈసీ కీలక భేటీ

అసోం, బంగాల్​, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో జరిగే శాసనసభ ఎన్నికల భద్రతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో సమావేశమైంది. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల పర్యవేక్షకులకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

EC-POLLS-OBSERVERS
ఎన్నిల భద్రతకు సంబంధించి ఈసీ ఆదేశాలు
author img

By

Published : Mar 3, 2021, 10:58 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికల భద్రతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీసు నోడల్​ ఆఫీసర్​, సీఏపీఎఫ్ సమన్వయ కర్తతో కూడిన కమిటీ.. ఎన్నికల భద్రతా ప్రణాళికను సిద్ధం చేస్తాయని తెలిపింది.

POLLS-OBSERVERS
ఎన్నికల భద్రతపై ఈసీ సమావేశం
EC-POLLS-OBSERVERS
ఎన్నికల భద్రతపై ఈసీ సమావేశం
POLLS-OBSERVERS
ప్రసంగిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్​ అరోడా

భద్రతా బలగాల తరలింపును ప్రత్యేక, జనరల్​, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారని ఈసీ తెలిపింది. ఒకవేళ భద్రతా దళాల తరలింపులో మార్పులేమన్నా చేయాలని ప్రత్యేక పోలీసు అధికారి సూచిస్తే.. దానికి అనుగుణంగా ప్రణాళికను మార్చాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీసు నోడల్​ ఆఫీసర్​, సీఏపీఎఫ్​ సమన్వయకర్తతో కూడిన కమిటీని ఆదేశించింది. ఇదే నిబంధన జిల్లా ఎన్నికల అధికారితో కూడిన కమిటీకి వర్తిస్తుందని తెలిపింది.

ఇదీ చూడండి: రాజకీయ పార్టీలతో ముగిసిన ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.