ETV Bharat / bharat

మినీ సార్వత్రికం: ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు? - assembly election results

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సర్వేల అంచనాలే నిజమయ్యాయి. బంగాల్​లో టీఎంసీ, కేరళలో ఎల్​డీఎఫ్​ అధికారం నిలబెట్టుకోగా.. తమిళనాడులో 10 ఏళ్ల తర్వాత డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. పుదుచ్చేరిలో యూపీఏను ఎన్​ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడించింది. అయితే గత ఎన్నికలు, ఈ ఎన్నికల్లో పార్టీల ఓటింగ్ శాతంలో వ్యత్యాసం ఎంత? ఏ పార్టీ బలం ఎంత పెరిగింది? ఇంటారాక్టివ్​ గ్రాఫిక్స్​ రూపంలో చూడండి.

Election results, elections 2021
ఓట్​ షేర్​, ఓటింగ్ శాతం
author img

By

Published : May 3, 2021, 4:07 PM IST

Updated : May 3, 2021, 4:15 PM IST

యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన మినీ సార్వత్రిక పోరు ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. బంగాల్​లో టీఎంసీకి భాజపా గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు. సీఎం మమతా బెనర్జీ చరిష్మాతో తృణమూల్ హ్యాట్రిక్​ కొట్టింది. తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. కేరళలో వాపమక్ష కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. 40ఏళ్ల అధికార మార్పిడి సంప్రదాయానికి తెరదించింది. అసోంలో భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్​ కూటమిని గద్దె దించి ఎన్​ఆర్​ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ అధికారం కైవసం చేసుకుంది.

అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీలే బంగాల్​, కేరళ, అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చాయి. గత ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఆ పార్టీల ఓటింగ్ శాతం ఎంత పెరిగింది? తమిళనాడులో డీఎంకేకు గత ఎన్నికల కంటే ఈసారి ఎంత శాతం ఓట్లు, ఎన్ని సీట్లు అధికంగా వచ్చాయో ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్​లో చూడండి.

బంగాల్​..

బంగాల్​లో​ 2011 నుంచి తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది అధికార తృణమూల్​ కాంగ్రెస్​. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42 ఎంపీ స్థానాలకు భాజపా 18 సీట్లు కైవసం చేసుకుని షాక్​ ఇచ్చింది. ఆ పార్టీకి 40.7 శాతం ఓట్లు పోలయ్యాయి. తృణమూల్​ కాంగ్రెస్​కు 43.3 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పక్కా వ్యూహాలను రచించి 2021 అసెంబ్లీ పోరులో బరిలోకి దిగింది టీఎంసీ​. దాదాపు 48 శాతం ఓట్లు కొల్లగొట్టింది. భాజపా ఓట్లను 2 శాతం తగ్గించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తమిళనాడులో..

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే హ్యాట్రిక్ ఆశలకు డీఎంకే గండి కొట్టింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతాన్ని దాదాపు ఐదు శాతం పెంచుకుంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరభావం చవిచూసిన అన్నాడీఎంకే ఓటింగ్ శాతాన్ని 18 నుంచి 33 శాతానికి పెంచుకుంది.

కేరళలో..

కేరళలో సీపీఎం సారథ్యంలోని వాపపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్​డీఎఫ్​) దశాబ్దాల సంప్రదాయానికి చరమగీతం పాడి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సీపీఎంకు 25.1 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్​ ఓట్లు 13 శాతం తగ్గి 24.8 శాతానికే పరిమితమయ్యాయి.

అసోంలో..

అసోంలో అధికార భాజపా కూటమే మరోసారి అధికారంలోకి వచ్చింది. భాజపాకు 33.21 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్​ 29.67 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఇదీ చూడండి: సాయంత్రం బంగాల్​ గవర్నర్​తో మమత భేటీ

ఈ నెల 7న సీఎంగా స్టాలిన్​ ప్రమాణస్వీకారం

Last Updated : May 3, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.