Election King Padmarajan: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఎన్నికల్లో 227వ సారి పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ కింగ్‌గా సుపరిచితమైన కే. పద్మరాజన్ ఫిబ్రవరి 19న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. పోటీకి సంబంధించి ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. నామినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా.. అందరి కన్నా ముందే పద్మరాజన్ నామపత్రాలు దాఖలు చేశారు.
అత్యధిక సార్లు పోటీ చేసిన పద్మరాజన్... అత్యధిక సార్లు ఓడిపోయి కూడా రికార్డులకెక్కారు. 1986లో మెట్టూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ తొలిసారి బరిలోకి దిగారు. ఆ తర్వాత మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయీపై లఖ్‌నవూలో, పీవీ నరసింహా రావుపై నంద్యాలలో పోటీ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీపై పోటీ చేశారు. 62 ఏళ్ల పద్మరాజన్ ప్రస్తుతం వీరక్కల్ పూడూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి : 'గర్భిణీలకు కొత్త రూల్స్'పై మహిళా కమిషన్ ఆగ్రహం.. వెనక్కి తగ్గిన ఎస్బీఐ!