ETV Bharat / bharat

తమిళనాట ఎన్నికల వేడి- కాంగ్రెస్​కు చావోరేవో! - కాంగ్రెస్​ డీఎమ్​కే తమిళనాడు వార్తలు

కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. తాజాగా బిహార్‌ ఎన్నికల ఫలితాలు పార్టీని మరింత నైరాశ్యంలోకి నెట్టాయి. దీని ప్రభావం పార్టీపై గట్టిగానే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల కోసం డీఎంకేతో పొత్తు-సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు మొదలుపెట్టింది.

Congress in a do or die battle
తమిళనాట ఎన్నికల వేడి.. కాంగ్రెస్​కు చావో రేవో
author img

By

Published : Dec 3, 2020, 1:03 PM IST

బిహార్‌ ఫలితాలు కాంగ్రెస్‌ను కుంగదీశాయి. పార్టీ శ్రేణులను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టాయి. బిహార్‌ ప్రభావం.. కాంగ్రెస్‌పై అన్ని విధాలుగా ఉండనుంది. ఈ పరిణామాలు.. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ పార్టీని ప్రభావితం చేయనున్నాయి. మహాకూటమిలో భాగంగా నిరాశ కలిగించే ఫలితాలు సాధించి.. కూటమికి అధికారం దూరం కావటానికి కారణమైందన్న వాదనల మధ్య.. డీఎంకే పొత్తు-స్థానాల కేటాయింపుపై పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ ముందుగానే పావులు కదుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని యోచిస్తోంది. సీట్ల పంపకం విషయంలో అప్పుడే చర్చలు మొదలుపెట్టింది.

రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ కేఎస్​ అళగిరి, తమిళనాడు కాంగ్రెస్​ పార్టీ బాధ్యుడు దినేశ్​ గుండురావ్​ సహా సీనియర్​ నేతలు ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎం​కే) అధినేత ఎమ్​కే స్టాలిన్​తో భేటీ అయ్యారు.

Tamil Nadu
స్టాలిన్​తో కాంగ్రెస్​ నేతల భేటీ
Tamil Nadu
స్టాలిన్​తో కాంగ్రెస్​ నేతల భేటీ

ఇరు పార్టీల నేతలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చలు జరిపినట్లు కాంగ్రెస్​ పార్టీ వర్గాల సమాచారం. అయితే పార్టీ వీటిని కొట్టిపారేసింది.

"అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఈ రోజు ఎలాంటి చర్చ జరగలేదు. డీఎం​కే నేతలను రాహుల్​ గాంధీ ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని ఆహ్వానించేందుకే వచ్చాం. రాహుల్​ గాంధీ ఎన్నికల ప్రచార తేదీలు ఇంకా కొలిక్కిరాలేదు. మిత్రపక్షాలు ఎన్నికల ప్రచారం గురించి చర్చించాం. పార్టీకి పట్టున్న స్థానాలను గుర్తించే పనిలో ఉన్నాం."

- కేఎస్​ అళగిరి, తమిళనాడు కాంగ్రెస్​ చీఫ్

రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పార్టీ సీనియర్​ నాయకులతో మంగళవారం చర్చించారు. సీట్ల పంపకం విషయంలో డీఎం​కేపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోమని అళగిరి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే చెప్పుకోదగ్గ స్థానాల్లో మాత్రం పోటీ చేస్తామన్నారు. గత 15 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు పొత్తుతోనే బరిలోకి దిగుతున్నాయి.

Tamil Nadu
డీఎంకే అధినేత స్టాలిన్​, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్

వరుస పరాజయాలు..

ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. 2011లో 63 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్​ 2016 ఎన్నికల్లో 41 సీట్లలోనే బరిలోకి దిగింది. అందులో కేవలం 8 స్థానాల్లోనే విజయం సాధించింది.

2019 లోక్​సభ ఎన్నికల తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమి పాలయింది. ఇటీవల జరిగిన బిహార్​ ఎన్నికలతో కాంగ్రెస్​ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

కాంగ్రెస్​ నాయకత్వలేమితో ఇబ్బంది పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోవడానికి కూడా ప్రాంతీయ పార్టీలు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. ఇదే సరైన సమయంగా భావిస్తోన్న కమలనాథులు వివిధ రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికలు కాంగ్రెస్​ పార్టీకి చావో రేవో అన్న విధంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.