ETV Bharat / bharat

ఎన్నికల ప్రధాన కమిషనర్​గా సుశీల్​ చంద్ర!

ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్​గా నియామకం కానున్నారు. ఈనెల 12న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా తర్వాత సీనియర్‌ అయిన సుశీల్‌ చంద్ర నియామకం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది.

CEC
ప్రధాన ఎన్నికల కమిషనర్​గా సుశీల్​ చంద్ర!
author img

By

Published : Apr 12, 2021, 5:10 AM IST

Updated : Apr 12, 2021, 6:46 AM IST

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులు కానున్నారు. సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంఘంలో సీనియర్‌ను సీఈసీగా నియమించటం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 12న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా తర్వాత సీనియర్‌ అయిన సుశీల్‌ చంద్ర నియామకం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఆయన నియామకంపై ఏ క్షణమైనా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్నికలసంఘం వర్గాలు తెలిపాయి.

ఈనెల 13న సీఈసీగా సుశీల్‌ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 14న ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమితులైన సుశీల్‌ చంద్ర పదవీకాలం 2022 మే 14 వరకూ ఉంది. ఆయన ఆధ్వర్యంలో గోవా, మణిపుర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఒక్కరోజే 63,294 కరోనా కేసులు

Last Updated : Apr 12, 2021, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.