ETV Bharat / bharat

మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ

author img

By

Published : Apr 4, 2021, 2:29 PM IST

నందిగ్రామ్​ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్​లో అవకతవకలు జరిగాయన్న తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వాటికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.

Election Commission
మమత ఆరోపణలన్నీ అవాస్తవాలే: ఈసీ

బంగాల్​ రెండో దశ పోలింగ్​లో నందిగ్రామ్​ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్​లో అవకతవకలు జరిగాయన్న తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, నిరాధారమైనవని పేర్కొంది.

బంగాల్​లో రెండోదశ పోలింగ్​ తీరుపై ఎన్నికల సంఘాన్ని మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సూచనలతోనే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. నందిగ్రామ్​ నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగినా.. అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈసీకి 63 ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:బంగాల్​లో ఆడియో టేపుల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.