లోక్ జనశక్తి పార్టీ(LJP news) పేరు, గుర్తును కొంతకాలం పాటు ఫ్రీజ్ చేసిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీ నేతలు(lok janshakti party leader) చిరాగ్ పాస్వాన్, పశుపతి కుమార్‌కు తాత్కాలికంగా వేర్వేరుగా పార్టీ పేర్లు, ఎన్నికల గుర్తులు కేటాయించింది.
చిరాగ్ పాస్వాన్‌కు 'లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్)' (chirag paswan party)పేరును, 'హెలికాప్టర్‌ను' ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు తెలిపింది.
అలాగే పశుపతి కుమార్ పరాస్‌కు 'రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీ' పేరును కేటాయించిన ఈసీ.. 'కుట్టుమిషన్'ను ఎన్నికల గుర్తుగా ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
"మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. మీ వర్గానికి 'రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ' పేరును ఖరారు చేసింది. ప్రస్తుతానికి మీ వర్గం తరఫున ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి 'కుట్టు మిషన్'ను గుర్తును కేటాయించింది" అని ఆదేశాల్లో తెలిపింది.
పార్టీలోని ఇరువర్గాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు ఎల్జేపీ పేరు, పార్టీ గుర్తు 'బంగ్లా'ను(lok janshakti party symbol) కొంతకాలం పాటు ఫ్రీజ్ చేస్తున్నట్లు అక్టోబరు 2 ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్ జనశక్తి పార్టీపై ఆధిపత్యం కోసం చిరాగ్, పశుపతి మధ్య కొన్నాళ్లుగా వైరం నెలకొంది. వీరిద్దరూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా.. ఈసీ దీనిపై స్పష్టతనిచ్చింది.
బిహార్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్ చేసిన ఈసీ