బంగాల్లో ఈనెల 16న జంగీపుర్, శంషేర్‌గంజ్ నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల సంఘం. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో ఇటీవలే ముగిశాయి. వాటితో పాటే ఈ రెండు నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సింది. కానీ, ఆర్‌ఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో జంగీపుర్, కాంగ్రెస్ అభ్యర్థి మృతితో శంషేర్‌గంజ్ స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఈ రెండు నియోజకవర్గాలతోపాటు బంగాల్లో మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తప్పనిసరైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దహా స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది. అక్కడ తృణమూల్ తరపున పోటీ చేసిన కాజల్ సిన్హా తాజా ఫలితాల్లో గెలుపొందారు. అయితే, కొవిడ్ సోకిన సిన్హా.. ఎన్నికల ఫలితం రాకముందే (గత నెల 25న) మృతి చెందారు.
అయితే.. ఈ మూడు స్థానాల్లో ఏదో ఒకదాన్నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి : 'మోదీ జీ.. విదేశాల సాయం వివరాలు వెల్లడించండి'