దిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో విషాదం జరిగింది. ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు రోగులు ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. మరో ఇద్దరు వార్డుల్లో చికిత్స పొందుతున్నారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఆక్సిజన్ కొరతతో శనివారం వీరు చనిపోయినట్లు చెప్పింది. మృతి చెందిననవారిలో ఓ వైద్యుడు కూడా ఉన్నారని వెల్లడించింది.
ప్రాణాలు కోల్పోయిన వారిలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి ఉన్నట్లు సమాచారం. మరో ఐదుగురు రోగులను కాపాడేందుకు వేరే ఆసుపత్రికి తరలించారు .