ETV Bharat / bharat

'కాకులు, కొంగలు తింటాం.. మాకు టీకా వద్దు'

కొవిడ్​ టీకా వేసేందుకు వెళ్లిన అధికారులు.. ఓ సంచార తెగ చెప్పిన సమాధానం విని షాక్​ అయ్యారు. తాము పక్షుల మాంసం తింటాం కాబట్టి, తమకు టీకా అవసరం లేదని వారు చెప్పారు. టీకా వద్దంటే వద్దంటూ వాగ్వాదానికి దిగారు. తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. వారిని టీకాలు వేసేందుకు ఎలా ఒప్పించాలా? అని ఆరోగ్య అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

vaccine
వ్యాక్సిన్​
author img

By

Published : Jun 28, 2021, 6:46 AM IST

"కావాలంటే కత్తి తీసుకుని మమ్మల్ని పొడవండి. కానీ టీకాలు మాత్రం మాకొద్దు. కాకులు, కొంగలను తింటాం మేం. మాకు కరోనా సోకదు." ఇదీ.. తమిళనాడు తిరునెల్వెలి జిల్లా నరిక్కురవార్​ ప్రాంతంలో ఉన్న ఓ సంచార తెగకు కొవిడ్​ టీకా వేసేందుకు వెళ్లిన ఆరోగ్య అధికారులకు ఎదురైన సమాధానం. ఇది విని విస్తుపోవటం వారి వంతైంది. ఇప్పుడు టీకా వేసేందుకు వారిని ఎలా ఒప్పించాలా? అని ఆ ఆరోగ్య కార్యకర్తలు నానా తంటాలు పడుతున్నారు.

అసలేం జరిగింది?

తిరునెల్వెలి జిల్లాలో వైరస్​ కట్టడి కోసం.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య ఉపకేంద్రాలకు వ్యాక్సినేషన్​ క్యాంపులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో.. నగర ఆరోగ్య అధికారి (సీహెచ్​ఓ) సరోజ నేతృత్వంలోని ఓ ఆరోగ్య బృందం.. నరిక్కురవార్ ప్రాంతంలోని ఓ​ కాలనీ వద్ద టీకా పంపిణీ చేయటం​ కోసం వెళ్లింది.

అయితే.. వారిని చూసిన అక్కడి ప్రజలు 'మాకు టీకా వద్దంటే వద్దం'టూ వాగ్వాదానికి దిగారు. "కొవిడ్​ టీకాలపై వారిలో సరైన అవగాహన లేదనడానికి ఇది నిదర్శనం. టీకాలు తమకు హానీ చేస్తాయనే వారు భయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ టీకా తీసుకుని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు అనే పుకార్లు వ్యాపిస్తున్నాయి" అని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఎంత చెప్పినప్పటికీ..

వారిని టీకాలు వేసుకునేలా ఒప్పించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను రెండు సార్లు టీకా వేసుకున్నానని సీహెచ్​ఓ వారికి వివరించారు. ఆమెతో పాటు నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కూడా అదే విధంగా చెబుతున్నారు. టీకాల వల్ల ఎలాంటి ప్రతికూల ఘటనలు ఎదురవ్వవని భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ.. నరిక్కురవాలోని ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము పక్షుల మాంసం తింటున్నందున తమకు కరోనా సోకదని ధీమాగా చెబుతున్నారు. కరోనా టీకాల గురించి అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నప్పటికీ ఇలాంటి సమాధానాలు విన్న ఆరోగ్య అధికారులకు ఏం చేయాలో తోచట్లేదు.

మా ఊరికి రావొద్దు...

తిరుచ్చి జిల్లాలోనూ ఇదే తరహా సంఘటన వైద్య సిబ్బందికి ఎదురైంది. ఆ జిల్లాలోని ఓ గ్రామస్థులు తమకు టీకాలు వేసేందుకు రానే రావద్దు అని చెబుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది వెళ్లే సమయానికి ఊర్లో ఉండకుండా వెళుతున్నారు. "ఇక్కడ చాలా మంది ప్రజలు పనులకు వెళ్లి రాత్రి పూట వస్తారు. వారికి టీకాల గురించి వివరించేందుకు మేము రాత్రిపూట వెళితే వారు మమ్మల్ని భయపెడుతున్నారు." అని ఓ నర్సు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి టీకాలు తీసుకుంటేనే రేషన్ సరకులు ఇస్తాం వంటి నిబంధనలు పెడితేనైనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తారు కాబోలు అని కొంతమంది వైద్య సిబ్బంది అసహనంతో చెబుతున్నారు.

ఇదీ చూడండి: పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

ఇదీ చూడండి: టీకా ప్రాముఖ్యతపై కళాకారుడి వినూత్న ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.