ETV Bharat / bharat

స్టూడెంట్స్​ ఫిట్​నెస్​ కోసం ప్రిన్సిపల్​ 'ఎగ్​ ఛాలెంజ్'​- రోజూ 6కి.మీ రన్నింగ్​ చేస్తే గిఫ్ట్​లుగా గుడ్లు! - ఉదయమే రన్నింగ్​ చేస్తున్న పాఠశాల విద్యార్థలు

Egg Challenge For Government School Students : విద్యార్థుల్లో క్రీడాస్పూర్తిని పెంచడానికి 'ఎగ్ ఛాలెంజ్​' పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఓ గవర్నమెంట్​ స్కూల్ ప్రిన్సిపల్. రోజూ ఆరు కిలోమీటర్లు రన్నింగ్​ చేస్తే విద్యార్థులకు గుడ్లను బహుమతులుగా ఇస్తున్నారు.

Egg Challenge For Government School Students

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 7:37 PM IST

Updated : Dec 9, 2023, 9:56 PM IST

స్టూడెంట్స్​ ఫిట్​నెస్​ కోసం ప్రిన్సిపల్​ 'ఎగ్​ ఛాలెంజ్'​- రోజూ 6కి.మీ రన్నింగ్​ చేస్తే గిఫ్ట్​లుగా గుడ్లు!

Egg Challenge For Government School Students : విద్యార్థుల్లో ఫిట్​నెస్​ కోసం 'ఎగ్ ​ఛాలెంజ్'​ పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభించారు ఓ స్కూల్ ప్రిన్సిపల్​​. ఆయనే ఝార్ఖండ్​ ఉత్తర సింహభూమ్​లోని టేంజేరీన్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్​ అర్వింద్ కుమార్. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన గుడ్లను బహుమతిగా ఇస్తున్నారు.

"ఈ పోటీని మేము 'అండా ఛాలెంజ్'గా పిలుస్తున్నాం. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తితో పాటు రన్నింగ్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ పోటీ నిర్వహిస్తున్నాం. విద్యార్థులంతా 3 కిలోమీటర్లు దూరం పరిగెత్తి ఛఖ్రీ పాఠశాల గోడను తాకి తిరిగి రావాలి. ఈ విధంగా ప్రతిరోజు 6 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలి"
- అర్వింద్ కుమార్ తివారీ, పాఠశాల ప్రిన్సిపల్.

Egg Challenge For Government School Students
విద్యార్థులతో రన్నింగ్ చేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్

పిల్లలలో క్రమం తప్పకుండా రన్నింగ్ చేసే అలవాటును పెంపొందించడం, వారి పోషకాహార అవసరాలను తీర్చడమే ఈ ఛాలెంజ్​ ప్రధాన లక్ష్యం. అయితే విద్యార్థులు గుడ్లను గెలుచుకోవాలంటే పోటీ సంబంధించిన పలు నియమాలను కూడా పాటించాల్సి ఉంది.

"మా పాఠశాలలో ప్రతిరోజు ఉదయం 6.30 గంటలకు పరిగెత్తుతూ చఖ్రీ స్కూల్ గోడను తాకాలి. అలా వారం రోజుల పాటు రన్నింగ్ చేస్తే వారికి ఎనిమిదో రోజు గుడ్లను ప్రిన్సిపల్ బహుమతిగా ఇస్తారు.

ప్రశ్న : ఈ విధంగా చేయడం వల్ల మీకొచ్చే లాభాలేంటి?

జవాబు : చాలా లాభాలున్నాయి. మేము మా శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకోవచ్చు"
-నిరంజన్ మాఝీ, విద్యార్థి.

"ఇంతకు ముందు నేను ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్ర మేల్కొనేదాన్ని. కానీ ప్రస్తుతం ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేస్తున్నా.

ప్రశ్న : మీరు ఏ సమయానికి గ్రౌండ్​కు చేరుకుంటారు?

జవాబు : మేము ఉదయం ఐదు గంటలు గ్రౌండ్​కు వెళ్తాం. ఆ తర్వాత రన్నింగ్ చేస్తాం"
- పుష్ప మాఝీ, విద్యార్థి.

"రన్నింగ్ వల్ల కాళ్లు మరింత దృఢంగా మారుతాయి. రోజు రన్నింగ్​కు వెళ్తే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం"-
- రాకేశ్ కుమార్ భగత్, విద్యార్థి.

నవంబర్ మొదటి వారంలో 32 మంది విద్యార్థులు విజయవంతంగా ఈ ఛాలెంజ్​ను పూర్తి చేసి గుడ్లను బహుమతిగా అందుకున్నారు. ఈ పోటీ నిర్వహణకు అయ్యే ఖర్చును పాఠశాల ప్రిన్సిపల్ అర్వింద్ కుమార్​ భరిస్తున్నారు. ఇవే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇతర కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు.

విజేతకు గుడ్లను బహుమతిగా ఇస్తున్న ప్రిన్సిపల్

Last Updated : Dec 9, 2023, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.