శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. పంజాబ్, మహారాష్ట్ర కోపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఆమెను ప్రశ్నించనుంది ఈడీ. ఆమెను డిసెంబర్ 29న తమ ముందు హాజరు కావాలని ఈ మేరకు సమన్లు జారీ చేశారు అధికారులు.
వర్షా రౌత్ బ్యాంక్ ఖాతాలోకి పలు లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలు ఎందుకు, ఎలా జరిపారనే విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఓ ఆస్తి కొనుగోలు చేసేందుకు ఆమె తీసుకున్న రుణంపైనా అధికారులు ప్రశ్నలు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ నేతకు..
వర్షా రౌత్ కన్నా ముందు ఎన్సీపీ నేత ఏక్నాథ్ ఖాడ్సేకు ఓ భూ వివాదంపై ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయను డిసెంబర్ 30న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. 2016లో ఆయన దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం వల్ల రాజీనామా చేశారు. భాజపాలో 40 ఏళ్లుపాటు ఉన్న ఏక్నాథ్ ఇటీవల ఎన్సీపీలో చేరారు.