ETV Bharat / bharat

ఆప్​ రెబల్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

ఫాజిల్కా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్​ కేసులో పంజాబ్​కు చెందిన ఆప్​ రెబల్ ఎమ్మెల్యే సుఖ్​పాల్​ సింగ్​ ఖైరా, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ మంగళవారం సోదాలు జరిపింది. కీలక పత్రాలను, డిజిటల్​ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి తెలిపారు.

ED raids Punjab MLA Khaira, others in drugs money-laundering case
ఆప్​ అసంతృప్త ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
author img

By

Published : Mar 9, 2021, 3:50 PM IST

పంజాబ్​కు చెందిన ఆమ్​ ఆద్మీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే సుఖ్​పాల్​ సింగ్​ ఖైరా, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మంగళవారం సోదాలు జరిపింది. 2015 నాటి ఫాజిల్కా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు, నకిలీ పాస్​పోర్ట్​ రాకెట్​కు సంబంధించిన మనీ లాండరింగ్​ కేసులో ఖైరా నివాసంతో పాటు ఆయన సంబంధించిన పంజాబ్​లో 9 ప్రదేశాల్లో, దిల్లీలో మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించింది.

2017లో ఖైరా.. ఆప్​ తరఫున భోలత్​ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీని వీడి సొంత పార్టీ(పంజాబ్​ ఏక్తా పార్టీ)ని స్థాపించారు.

కేసు వివరాలు..

పంజాబ్​లోని ఫాజిల్కా జిల్లాలో 1800 గ్రాముల హెరాయిన్​, 24 బంగారం బిస్కెట్​లు, రెండు ఆయుధాలు, 26 లైవ్​ క్యాట్రిడ్జ్​లు, పాకిస్థాన్​కు చెందిన రెండు సిమ్​ కార్డులను అంతర్జాతీయ డ్రగ్స్​ ముఠా నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కేసులో దోషులకు జైలు శిక్ష పడింది. ఇటీవల వీరిని విచారించిన ఈడీ... సుఖ్​పాల్​ సింగ్ ఆ ముఠాకు​ సహకరించారని ఆరోపిస్తోంది. ఈ కేసుతో సుఖ్​పాల్​కు సంబంధాలున్నాయని పంజాబ్​ పోలీసులతో సహా ఈడీ కేసు నమోదు చేసింది.

తాజా సోదాల్లో కీలక పత్రాలను, డిజిటల్​ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి తెలిపారు. అయితే... తను ఎలాంటి తప్పు చేయలేదని మీడియాకు సుఖ్​పాల్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద బాంబుల కేసులో మరో ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.