ETV Bharat / bharat

మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న కవిత.. 16న మళ్లీ రావాలన్న ఈడీ

MLC Kavitha ED Investigation In Delhi Liquor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, అరెస్ట్ చేసిన నిందితుల నుంచి చట్టపరంగా తీసుకున్న స్టేట్‌మెంట్లలోని సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు. తిరిగి ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. విచారణ అనంతరం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో కలిసి కవిత హైదరాబాద్‌ చేరుకున్నారు.

MLC Kavitha ED Investigation In Delhi Liquor Case

author img

By

Published : Mar 12, 2023, 7:36 AM IST

దిల్లీ మద్యం కేసులో ముగిసిన కవిత ఈడీ విచారణ

MLC Kavitha ED Investigation In Delhi Liquor Case: దిల్లీ సర్కారు రూపొందించిన మద్యం విధానాన్ని అనుకూలంగా మలచుకొని అనుచిత లబ్ధి పొందారనే ఆరోపణలపై ఈడీ.. ఇప్పటికే పలువురు నిందితులు, సాక్షులను ప్రశ్నించింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శనివారం సుమారు 8 గంటలు ప్రశ్నించారు. ఉదయం దిల్లీ తుగ్లక్‌ రోడ్డులోని సీఎం కేసీఆర్‌ నివాసంలో మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌.. కవితతో సమావేశమై చర్చించారు. తర్వాత భర్త అనిల్‌, తమ న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ వద్దకు వెళ్లారు.

అప్పటికే అక్కడ ఉన్న బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేసి ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. సాయంత్రం 4 గంటలకు భోజన విరామం ఇవ్వడంతో గంటపాటు విచారణ జరిపిన గది నుంచి బయటకు వచ్చి.. తిరిగి విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి మొదలైన విచారణ రాత్రి 8 గంటలకు ముగిసింది.

అన్ని ప్రశ్నలు సాధారణ అంశాలపైనే: తొలి రోజు కవిత విచారణ అంతా సాధారణ అంశాలపైనే సాగినట్లు తెలిసింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న మిగతా నిందితులను కవిత ముందు కూర్చోబెట్టి వివరాలను రాబట్టే ప్రయత్నం చేయలేదని సమాచారం. తదుపరి దశలో ఆ పని చేయనున్నట్లు తెలిసింది. విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించినట్లు సమాచారం. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల గురించి తనకు తెలియదని కవిత పేర్కొన్నట్లు తెలిసింది.

బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైలు వ్యక్తిగతంగా తెలిసినా, వారి వ్యవహారాలతో తనకు సంబంధం లేదని సౌత్‌గ్రూప్, ఇండోస్పిరిట్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పీఎంఎల్​ఏ సెక్షన్ 50 కింద కవిత చెప్పిన సమాధానాలు అన్నింటిని లిఖిత పూర్వకంగా స్టేట్​మెంట్​ను రికార్డు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారులు కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం సాగినా.. ఆ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కవిత పిడికిలి బిగించి చూపారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్​కు చేరుకున్నారు.

Delhi Liquor Scam Case Update: కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డికి చెందిన బినామీ సంస్థ సౌత్‌గ్రూప్ ద్వారా ఆప్‌ నేతలకు హవాలా మార్గంలో రూ.100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా చేసుకొని అనుచిత లబ్ది పొందారని కేసులో ప్రధానంగా ఉన్న ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా దిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణ, తమిళనాడుల్లోని 183 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. అందులో వివిధ డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది.

ఆప్‌ నేతలకు ముడుపులు ముట్టజెప్పిన వ్యక్తులు, సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి హోల్‌సేల్‌, రిటైల్ వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని అనుచితంగా ప్రయోజనం పొందినట్లు గుర్తించింది. ఆ మొత్తం వ్యవహారం వల్ల దిల్లీ ప్రభుత్వానికి.. రూ.2,873 కోట్ల ఆదాయ నష్టం జరిగినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది. కుంభకోణంలో బినామీలు, నిగూఢ పెట్టుబడులు దాగి ఉన్నట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. ఈడీ అధికారులు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్టు చేశారు.

సమీర్‌ మహేంద్రు, విజయ్‌ నాయర్, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్ బాబు.. అభిషేక్‌ బోయినపల్లి, అమిత్ అరోరా, మాగుంట రాఘవ, అమన్‌దీప్‌ దళ్‌, అరుణ్‌ రామచంద్రపిళ్లై, మనీష్ సిసోదియాను అరెస్ట్ చేసి వారి నుంచి విభిన్న కోణాల్లో వివరాలు రాబట్టింది. కుంభకోణం జరిగిన ఏడాది కాలంలో నిందితులు 170 ఫోన్లు ధ్వంసం చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. అందులో కవిత రెండు నెంబర్లతో వాడిన పది ఫోన్లు, ఆమె బినామీగా చెప్పుకున్న అరుణ్‌పిళ్ళై 5 ఫోన్లు, ఆడిటర్ బుచ్చిబాబు 6 ఫోన్లు ధ్వంసం చేసినట్లు కనిపెట్టింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.