ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవ్వాలని ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది.
ఇటీవల సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. అనిల్ దేశ్‌ముఖ్‌ను విచారణకు పిలిపించే అవకాశం ఉంది. బార్లు, రెస్టారెంట్ల నుంచి లంచాలు వసూలు చేయాలని ఆదేశించినట్లు వచ్చిన ఆరోపణల వ్యవహారంలో అనిల్ దేశ్‌ముఖ్ ఇటీవల మంత్రిపదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి : ఈసీ అడ్డగోలు వాదనలు - సుప్రీంకోర్టు మొట్టికాయలు