ETV Bharat / bharat

శివసేన నేత సంజయ్​ రౌత్ ఆస్తులు సీజ్​ - సంజయ్​ రౌత్ వార్తలు

Sanjay Raut ED: శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​, ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. రూ.1000 కోట్లు విలువైన పాత్రచాల్ భూకుంభకోణం కేసులో మనీలాండరింగ్​ చట్టం కింద ఈమేరకు చర్యలు చేపట్టింది.

సంజయ్​ రౌత్
సంజయ్​ రౌత్
author img

By

Published : Apr 5, 2022, 3:02 PM IST

Updated : Apr 5, 2022, 4:10 PM IST

Sanjay Raut News: శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్​ రౌత్​కు సంబంధించిన ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ సీజ్ చేసింది. రూ.1,043 కోట్లు విలువైన పాత్రచాల్​ భూకుంభకోణంలో ఆయనతో పాటు కుటుంసభ్యులకు చెందిన అలిబాగ్​లోని 8 భూములు, ముంబయి దాదర్​లోని ఓ ఫ్లాట్​ను జప్తు చేసింది. మనీలాండరింగ్​ నిరోధక చట్టం కింద ఈమేరకు చర్యలు చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్​ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసింది ఈడీ. అనంతరం ఛార్జ్​షీట్ కూడా దాఖలు చేసింది. మరో మనీలాండరింగ్ కేసు పీఎంసీ బ్యాంక్​ మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ సతీమణి వర్షా రౌత్​ను గతేడాదే ప్రశ్నించింది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​. ప్రవీణ్​ రౌత్ భార్య మాధురితో వర్షాకు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది. ఇప్పుడు వీరికి చెందిన రూ.11.5కోట్లు విలువ చేసే ఆస్తులను కూడా జప్తు చేసింది.

ఈడీ చర్యలపై సంజయ్​ రౌత్ స్పందించారు. తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తన ఆస్తులు జప్తు చేసినా, జైలుకు పంపినా, తుపాకీతో కాల్చినా బెదరబోనని చెప్పారు. తాను బాలాసాబెహ్​ ఠాక్రే ఫాలోవర్​ను అని, శివ సైనికుడ్ని అని పేర్కొన్నారు. పోరాటం చేసి అసలు వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేస్తానని శపథం చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని రౌత్ అన్నారు.

ఇదీ చదవండి: 'సవాళ్ల బాటలో కాంగ్రెస్.. పార్టీ పునరుద్ధరణ ప్రజాస్వామ్యానికి కీలకం'

Last Updated : Apr 5, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.