ETV Bharat / bharat

ఎరువుల స్కాంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు - అమరేంద్ర ధారి సింగ్ ఫర్టిలైజర్ స్కామ్

ఎరువుల కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్ అరెస్టయ్యారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

ED arrests RJD Rajya Sabha MP AD Singh in fertilizer scam case
ఫర్టిలైజర్ కుంభకోణంలో రాజ్యసభ ఎంపీ అరెస్టు
author img

By

Published : Jun 3, 2021, 3:22 PM IST

రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, రాజ్యసభ ఎంపీ అమరేంద్ర ధారి సింగ్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఎరువుల కుంభకోణం కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకుంది. దిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలో అమరేంద్రను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ED arrests RJD Rajya Sabha MP AD Singh in fertilizer scam case
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​తో అమరేంద్ర(ఎడమ)

కొద్దిరోజుల క్రితం ఫర్టిలైజర్ స్కామ్​కు సంబంధించి సీబీఐ సైతం కేసు నమోదు చేసింది. బిహార్ రాజకీయాల్లో అమరేంద్ర​కు చాలా ప్రాధాన్యం ఉంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​కు ఈయన సన్నిహితుడు. మూడు దశాబ్దాలుగా ఆయన వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారు. సూపర్-30 పేరుతో ఐఐటీ ప్రవేశాల కోసం నిర్వహించిన కోచింగ్ ఇన్​స్టిట్యూట్​కు ఈయన మద్దతు ఇచ్చినట్లు చెబుతారు.

ఇదీ చదవండి- వ్యభిచార ముఠా నుంచి ఇద్దరు నటులకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.