ETV Bharat / bharat

విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు - సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు

ec letters to telangana cs
ec suspends musheerabad police officers
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 8:01 PM IST

Updated : Nov 29, 2023, 9:19 PM IST

19:51 November 29

విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు

EC Suspends Musheerabad Police Officers : విధి నిర్వహణలో పక్షపాతం, నిర్లక్ష్యం వహించారని ఈసీ(ECI) ఆదేశాల మైరకు.. హైదరాబాద్​లో ముగ్గురు పోలీసు అధికారులను సీఎస్‌ సస్పెండ్ చేశారు. సప్పెండ్ అయిన వారిలో సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్పెక్టర్ జహంగీర్​లు ఉన్నారు. నిన్న ఎన్నికల తనిఖీల్లో ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్‌ ముషీరాబాద్​లోని.. సంతోష్ ఎలైట్‌ అపార్ట్​మెంట్లో డబ్బులు పంచుతున్నారని సమాచారం వచ్చింది. అక్కడి చేరుకున్న ఎఫ్‌ఎస్‌టి బృందాన్ని చూసి స్థానికులు పరారయ్యారు.

ఖాకీ నిఘాలో పోలింగ్ కేంద్రాలు- లక్షమందితో పటిష్ఠ బందోబస్తు

Telangana Assembly Elections 2023 : అక్కడే నిలిపి ఉన్న AP 28 CH 6759 నంబరు గల కారులో 18లక్షలు, చెక్‌బుక్‌, 2సెల్‌ఫోన్​లను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కారు, నగదు ముషీరాబాద్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్​లో నిందితుల పేర్లు మాత్రం గుర్తు తెలియని వారివిగా నమోదు చేశారు. సెక్షన్లు కూడా సరైనవి పెట్టలేదు. కాగా ఈ విషయంపై సీపీ సందీప్ శాండిల్యా ఆరా తీయగా.. సదరు కేసులో ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్‌, సుధాకర్​ను అరెస్ట్ చేసినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు.

దీంతో ఘటనపై దృష్టి సారించిన ఈసీ.. ముషీరాబాద్ ఇన్​స్పెక్టర్​ జహంగీర్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాలని సీఎస్​ను ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ముషీరాబాద్ ఇన్పెక్టర్​గా అదే స్టేషన్​లో పనిచేసే డీఐ వెంకట్ రెడ్డి నియామిస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులిచ్చారు. సెంట్రల్​ జోన్ డీసీపీగా ప్రస్తుతం టాస్క్​ఫోర్స్ డీసీపీ నితిక పంత్‌ లేదా ట్రాఫిక్ డీసీపీ -2 గా ఉన్న అశోక్‌ కుమార్, లేదా ట్రాఫిక్ డీసీపీ-3 గా ఉన్న డి శ్రీనివాస్‌ లను నియమించే అవకాశం ఉందని తెలిపారు. చిక్కడ పల్లి ఏసీపీగా ఎన్నికల కోడ్​లో బదిలీ కాని అధికారి నియమితులు అవుతారని సీపీ శాండిల్య వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌కు రంగం సిద్ధం - పూర్తైన ఎన్నికల సామగ్రి పంపిణీ

Last Updated : Nov 29, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.