తమిళనాడులో భారీగా బంగారాన్ని సీజ్ చేసింది ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్. తిరుపత్తూర్ జిల్లా చిన్న కంథాల్ చెక్పోస్ట్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలో రూ.22 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
వ్యాను యజమానిని హోసూర్ టైటాన్గా గుర్తించారు అధికారులు. ఈ బంగారాన్ని జ్యువెల్లరీ దుకాణాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సరైన పత్రాలను చూపించినట్లు సమాచారం. అయితే.. ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో బంగారం తరలించకూడదని ఈ వ్యాన్ను సీజ్ చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.