బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ చీఫ్ హగ్రామ మొహిలరీను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేసిన అసోం మంత్రి, భాజపా సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మకు ఊరట లభించింది. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఎన్నికల సంఘం శనివారం అనుమతి ఇచ్చింది.
హగ్రామా మొహిలరీపై హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆయన ప్రచా రంపై 48 గంటల పాటు నిషేధించింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరుతున్నానని, ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్నందున తన ప్రచారానికి అవకాశం ఇవ్వాలని ఆయన ఎన్నికల సంఘాన్ని అభ్యర్థిం చారు.
దీంతో, ఎన్నికల నియమావళికి లోబడే ప్రచారం నిర్వహించాలంటూ షరతులు విధించిన ఎన్నికల సంఘం.. ఆయన పై ఉన్న నిషేధాన్ని 48 గంటల నుంచి 24 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
'ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదు'
హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంపై ఉన్న నిషేధాన్ని సడలించిన ఎన్నికల సంఘాన్ని చరిత్ర క్షమించదని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది.
హిమంత బిశ్వ శర్మ సోదరుడి బదిలీ
అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదం నేపథ్యంలో ఆయన సోదరుడు, ఆ రాష్ట్రంలోని గోల్ పర ఎస్పీ సుశాంత్ బిశ్వ శర్మను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. సుశాంత్ బిశ్వ శర్మను ఆ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో వీరవెంకట రాకేశ్ రెడ్డిని గోల్ పర ఎస్పీగా నియమించింది.
ఇదీ చదవండి: అసోం మంత్రికి ఈసీ షాక్.. ప్రచారంపై నిషేధం
ఇదీ చదవండి: బంగాల్ క్షేత్రంలో స్థానిక, స్థానికేతర పోరు