ఎన్నికల అధికారులు(ప్రత్యేకించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు) రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి వేధింపులకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమైంది. ఎన్నికలు జరిగిన ఏడాది వరకు పాత కేసులు సహా ఏ కారణంతోనూ రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై చర్యలు చేపట్టకూడదని విజ్ఞప్తి చేయనుంది. ఈ లేఖలో పేర్కొనాల్సిన అంశాలపై ఈసీ మరింత కసరత్తు చేసి, తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
పాత ఫిర్యాదులతో వేధింపులు..
రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆధ్వర్యంలోనే ఈసీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే ఎన్నికలు ముగిశాక పాత ఫిర్యాదులు, కేసులతో రాష్ట్ర ప్రభుత్వాలు వారిని వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కేంద్రానికి లేఖ రాయాలనుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి : కశ్మీర్ ఎన్నికల ప్రక్రియలో నూతన అధ్యాయం