ETV Bharat / bharat

EC Orders to DK Aruna Elected From Gadwal Constituency : గద్వాల నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని ఈసీ ఆదేశం - Gadwal MLA Krishnamohan Reddy

DK Aruna latest
DK Aruna
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 5:20 PM IST

Updated : Sep 4, 2023, 7:14 PM IST

17:11 September 04

EC Orders to DK Aruna Elected From Gadwal Constituency : గద్వాల నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని ఈసీ ఆదేశం

EC Orders to DK Aruna Elected From Gadwal Constituency : గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్​లో ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీరు కాపీని ఈసీ జతపరిచింది. ఇందుకుగాను సీఈఓకు.. ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్​ కుమార్​ లేఖ రాశారు.

ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. వెంటనే గెజిట్​ను పబ్లిష్ చేయాల్సిందిగా.. అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్​రాజ్​కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. గెజిట్ పబ్లిష్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆదేశాలను అమలు చేస్తూ తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అలాగే త్వరలో తాను అసెంబ్లీ సెక్రెటరీని కలవబోతున్నట్లు వెల్లడించారు.

Gadwal MLA Election Controversy : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి(Gadwal MLA Krishnamohan Reddy) ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్​ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్​ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్​రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున.. రూ.2 లక్షల 50 వేలు జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

BJP Comments on BRS MLA Candidates 2023 : 'దమ్ముంటే ఈటలపై పోటీ చేయ్.. కేసీఆర్'

ఇదీ జరిగింది : 2018 అసెంబ్లీ ఎన్నికలో బీఆర్​ఎస్​ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్​ నుంచి డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణపై కృష్ణమోహన్​రెడ్డి 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్​లో కృష్ణమోహన్​రెడ్డి తన ఆస్తులు, చలాన్లు, అప్పుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని డీకే అరుణ 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ అయ్యాయని.. వీవీప్యాట్​లు లెక్కించాలని ఆమె కోరారు. హైకోర్టులో ఎన్నిక వివాదంపై విచారణ జరుగుతుండగానే ఆమె బీజేపీలో చేరారు.

సుప్రీం కోర్టుకు వెళ్లనున్న గద్వాల ఎమ్మెల్యే : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విషయంపై ఆయన స్పందించి.. సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తనకు ఇంకా హైకోర్టు నోటీసులు రానందున వాదనలు వినిపంచలేక పోయాయని వివరించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరణ కూడా ఇచ్చారు. తన వాదనను వినకుండా హైకోర్టు తీర్పును వెలువరించిందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్​రెడ్డి ఆవేదన చెందారు. డీకే అరుణ ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. కోర్టును ఆమె తప్పుదోవ పట్టించారన్న ఆయన.. ప్రజాకోర్టులో అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. అయితే హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్​రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేస్తే.. డీకే అరుణ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అవుతారు. కాగా.. ఇప్పుడు ఎమ్మెల్యేల పదవి కాలం దాదాపు ముగిసిపోయిన అధ్యయనంలాగే ఉంది.

DK Aruna Submits Judgement Copy : నన్ను MLAగా గుర్తించండి : డీకే అరుణ

Telangana High Court Shock TO Gadwala MLA : "డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. నేను ప్రజల మనిషిని"

Last Updated : Sep 4, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.