ETV Bharat / bharat

'ఈసీ పరిశీలకుల తీరుపై సుప్రీం కోర్టుకు వెళ్తా'

భాజపాకు సాయం చేసేందుకే ఎన్నికల సంఘం పరిశీలకులు పని చేస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పోలింగ్​ సమయంలో తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ పోలీసులకు వారు ఆదేశాలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల ముగిసిన తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

mamata benarjee, west bengal cm
ఈసీ పరీశీలకులపై మమతా బెనర్జీ ఆరోపణలు
author img

By

Published : Apr 24, 2021, 4:05 PM IST

పోలింగ్​ సమయంలో తమ పార్టీ నేతలను అరెస్టు చేయాలని పోలీసులకు ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు ఆదేశాలిస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికలు ముగిసిన తర్వాత తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. బీర్​భూమ్​ జిల్లా బోలాపుర్​లోని గీతాంజలి ఆడిటోరియమ్​లో తమ పార్టీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. తనపై షోకాజ్​ నోటీసులు జారీ చేసినా కూడా తాను ఈ విషయంలో మౌనంగా ఉండబోనని పేర్కొన్నారు.

"ఇక భరించింది సరపోయింది. స్వేచ్ఛాయుత, నిజాయితీ ఎన్నికల కోసం వారు(ఎన్నికల పరిశీలకులు) పనిచేస్తే నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ, వాళ్లు భాజపాకు సాయం చేసేందుకు మాత్రమే పని చేస్తున్నారు. టీఎంసీని నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఈ అధికారులు పోలింగ్​కు ముందురోజు రాత్రి మా కార్యకర్తలను అరెస్టు చేసి.. సాయంత్రం 4 గంటల వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశాలిస్తున్నారు. ఈ వాట్సాప్​ సంభాషణలను భాజపాలోని నాయుకులు నాకు ఇచ్చారు."

-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి

ఈసీ ప్రత్యేక పరిశీలకులకు, డిస్ట్రిక్ట్​ మేజిస్ట్రేట్​లు, ఎస్​పీలకు మధ్య జరిగినట్లు ఉన్న వాట్సాప్ సంభాషణల ట్రాన్స్​స్క్రిప్ట్​ను మమత చూపించారు. ఈ వ్యవహారంపై తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. 'ఏదేమైనా.. బంగాల్ ఎన్నికలను ఆ ముగ్గురు పరిశీలకులు ప్రభావితం చేయలేరని,​ భాజపాకు 70 సీట్లకు మించి రావు' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ప్రచారంలో కొవిడ్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఇదీ చూడండి: బంగాల్​: ఎనిమిదో దశలో 23% మందికి నేరచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.