బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 3న ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. మత ప్రాతిపదికన ఓట్లు అడగటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మమతకు నోటీసులు జారీ చేసింది.
ఏప్రిల్ 3న హూగ్లీలోని తారకేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమత.. 'ఇతర పార్టీలకు ఓటు వేసి ముస్లింలు తమ ఓటు బ్యాంకును చీలనీయొద్దు' అని అన్నట్లు భాజపా ఆరోపిస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: ఉదయనిధి వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు