దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనాకు కారణంగా చూపుతూ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఈసీ. ఈ పిటిషన్పై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం విచారించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారి అమిత్ శర్మ తెలిపారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ర్యాలీలు, సభలకు అనుమతి ఇవ్వడంపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ.. అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : 'ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి'